తారాగణం: శ్రీ విష్ణు, నివేత పేతురాజ్
దర్శకుడు: వివేక్ ఆత్రేయ
సంగీతం: ప్రశాంత్ విహారి
నిర్మాత: రాజ్ కందుకూరి
అరవింద్ కృష్ణ (శ్రీ విష్ణు) చిన్నపాటి నుండి ప్రతి విషయంలో ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటాడు. దీనికి తోడు అమ్మాయిలంటే విపరీతమైన సిగ్గు. పెద్దయ్యాక సాఫ్ట్ వేర్ ఉద్యోగి అవ్వగా, తల్లితండ్రులు సంభందాలు చూస్తుంటారు. ఎవరిని చూస్ చేసుకోవాలో తెలియక తికమక పడుతుంటాడు అరవింద్. ఒకానొక అమ్మాయి స్వేచ్ఛ(నివేత) నచ్చగా తాంబూలాలు మార్చుకొనే సరికి అమ్మాయి బామ్మ చనిపోవడంతో అది కాస్తా వాయిదా పడుతుంది. వారిరువురు బయట కలిసి బాగా దగ్గరవుతారు. ఈ లోపు అతనికి ముంబై ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రయాణంలో మరో అమ్మాయి తో పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి విచిత్ర స్వభావం నచ్చి ఆమె తో కూడా ప్రేమలో పడతాడు. తన కన్ఫ్యూషన్ మైండ్ వాళ్ళ ఇద్దరిలో ఎవరిని ఎంచుకోవాలో నిర్ణయంచుకోలేక పోతాడు అరవింద్.
కథనం:
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మెంటల్ మదిలో సరి కొత్త ట్రీట్మెంట్ వల్ల ఫ్రెష్ గా అనిపిస్తుంది. దర్శకుడు యూత్‌ఫుల్ నరేషన్ ఆకట్టుకుంటుంది. స్లో గా స్టార్ట్ అయినా క్లాస్ కామెడీ తో ఎంటర్టైన్ చేస్తుంది. హీరోయిన్ నివేత ఎంట్రీతో కదా ఊపందుకుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ తో కథ కొత్త మలుపు తిరిగి రెండో హీరోయిన్ చిత్రమైన క్యారెక్టర్ తో మరింత ఆసక్తికరమవుతుంది ద్వితీయార్ధం. ఎక్కువ డ్రామా లేకుండా సహజంగా ఉండే ఎమోషన్స్ హత్తుకుంటాయి. కథతో పాటు ట్రావెల్ అయ్యి, క్లైమాక్స్ వచ్చేసరికి ప్రేక్షకుడు కూడా హీరోలాగే ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అర్ధంకాక తికమక పడే స్థాయిలో మెస్మెరైజ్ చేసాడు దర్శకుడు
సాంకేతిక వర్గం:
మెంటల్ మదిలో మంచి విలువలతో న్యాచురల్ గా సాగే చిత్రం. సింపుల్ సినిమాటోగ్రఫీ, చక్కటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చిత్రానికి ఆహ్లాదకర వాతావరణాన్ని సమకూర్చాయి. ఎడిటింగ్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి.
పెరఫార్మన్సెస్:
శ్రీ విష్ణు కి సరైన క్యారెక్టర్ పడింది. కన్ఫ్యూషన్ మాస్టర్ గా అతను పలికిని హావభావాలు, ఎక్స్ప్రెషన్స్ పాత్రను ప్రేక్షకుడిని ఒప్పించేలా ఉన్నాయి. విష్ణు తన మార్క్ డైలాగ్ డెలివరీతో కితకితలు పెడతాడు. నివేత పేతురాజ్ మొదటి చిత్రంలోనే చాల ఎక్సపీరియెన్స్డ్ నటన ప్రదర్శించింది. మరో కొత్త అమ్మాయి కూడా బాగా చేసింది.
చివరి మాట: మెంటల్ మదిలో – కన్ఫ్యూషన్ లేకండా చూసి ఆనందించే చిత్రం