మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల

Mass hero vishaal Abhimanyudu teaser is out
మాస్‌ హీరో విశాల్‌… విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ‘అభిమన్యుడు’. ఈ చిత్రంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌తో అలరిస్తారు. మాస్‌ హీరో విశాల్‌ సరసన సమంత నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘ఈ కాలపు దొంగకి నీ ఇంటి తాళాలు అక్కర్లేదు. నీ గురించిన ఓ చిన్న ఇన్‌ఫర్మేషన్‌ చాలు..’ అంటూ ప్రారంభమయ్యే టీజర్‌లో సినిమా ఏ ఫార్మాట్‌లో ఉండబోతోంది, టెక్నికల్‌గా ఎలాంటి స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని రూపొందించారు అనే విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. యువన్‌ శంకర్‌రాజా అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వల్ల సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందనేది టీజర్‌లోనే అర్థమవుతుంది. విశాల్‌ న్యూ లుక్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లు, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ డిఫరెంట్‌ లుక్‌, సమంత గ్లామర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. విశాల్‌ కెరీర్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమాగా ‘అభిమన్యుడు’ నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రాన్ని జనవరిలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు విశాల్‌.
మాస్‌ హీరో విశాల్‌, సమంత, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తోపాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: రూబెన్‌, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, ఆర్ట్‌: ఉమేష్‌ జె.కుమార్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, నిర్మాత: విశాల్‌, దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here