పి.ఎస్.వి గరుడ వేగా రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date
2017-11-03

Critic Reviews for The Boxtrolls

తారాగణం: రాజశేఖర్, పూజ కుమార్, శ్రద్ధ దాస్, సన్నీ లియోన్, పోసాని కృష్ణ మురళి,

దర్శకుడు: ప్రవీణ్ సత్తారు

సంగీతం: శ్రీచరణ్ పాకాల,భీమ్స్ సిసిరోలియో

ఛాయాగ్రహం: అంజి

నిర్మాత: M కోటేశ్వర రాజు, మురళి శ్రీనివాస్

బ్యానర్:జ్యో స్టార్ ఇంటర్ప్రైస్

కథ:

శేఖర్ (రాజశేఖర్) ఓ ఎం ఐ ఏ గూఢచారి కావడంతో అనునిత్యం సీక్రెట్ ఆపరేషన్ ల తో బిజీ గా ఉండి భార్యకు కుటుంబానికి టైం కేటాయించలేక పోతుంటాడు. ఈ కారణంగా అయన భార్య (పూజ కుమార్) విడాకులు కోరుతుంది. శేఖర్ ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకుంటాడు. కానీ అనుకోకుండా ఓ అంతర్జాతీయ ఆపరేషన్ లోకి దిగుతాడు. ఆ స్కాములో బడా రాజకీయ నేతలు , అంతర్జాతీయ ముఠా వెనక ఉన్నారని తెలుసుకుంటాడు. శేఖర్ తన అనుచరులతో ఆ ముఠా ని ఎలా చేరుకుంటాడు? వారు దేశానికి తలపెట్టిన ముప్పు ఏమిటి? శేఖర్ వారి బారి నుండి దేశాన్ని ఎలా రక్షిస్తాడు? తన భార్యకు విడాకులు ఇస్తాడా లేదా? వంటి ఆసక్తి కార ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే గరుడ వేగా చూడాల్సిందే

కథనం:

పేరుకు తగ్గట్లే గరుడ వేగా వేగవంతమైన కథనంతో సాగుతుంది. ఇంటర్వెల్ వరకు ఊపిరి సలపని ఆక్షన్ సీన్లు ఛేజింగ్ సీన్ల తో ఆధ్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది చిత్రం. ఇంటెలిజెంట్ స్పై థ్రిల్లర్ అయినా, ప్రవీణ్ సత్తారు చాలా క్లారిటీ తో తెరకెక్కించడం తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేట్లుంటుంది. సెకండ్ హాఫ్ అసలు సస్పెన్స్ రివీల్ అవ్వడం తో కొద్దిగా స్పీడ్ తగ్గినట్లనిపిస్తుంది. హాలీవుడ్ స్థాయి స్టంట్ ఎపిసోడ్స్ థ్రిల్ చేస్తాయి. కొన్ని లాజిక్లను పక్కన పెట్టాడు దర్శకుడు, అయితే చిత్రం నడిచే వేగంలో అవి అంతగా పట్టవు.

సాంకేతికత:

అబ్బురపరిచే సరికొత్త లొకేషన్స్ ను ఛాయాగ్రాహకుడు అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా యాక్షన్ మరియు ఛేజింగ్ సీన్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. ఛాయాగ్రాహకుడు అంజికి మంచి భవిష్యత్తు ఉంది. దానికి తోడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ శ్రీచరణ్ పాకాల చాలా టెర్రిఫిక్ గా ఇచ్చాడు. సాంకేతిక విలువలు సన్నివేశాలను మరింత రక్తి కట్టించడంలో తోడ్పడ్డాయి. చిత్రంలో రెండే పాటలున్నాయి, సన్నీ లియోన్ ఐటెం పాట అలరిస్తుంది. సీన్లను స్టైల్ గానూ, ఇంటరెస్టింగ్ గా ను తెరకెక్కించడంలో దర్శకుడు ప్రతిభ పాటవాలు మెచ్చుకోవాలి.

తారాబలం:

కంబ్యాక్ చిత్రంగా రాజశేఖర్ గరుడ వేగను ఎంచుకోవడం తోనే ఆయన సక్సెస్ అయ్యారు. మగడు మరియు అంకుశం నాటి రాజశేఖర్ను మల్లి చూడచ్చు. ఓ పక్క ఎన్.ఐ.ఏ ఆఫీసర్ గా సీరియస్ నటన కనబరుస్తూనే మరో పక్క భార్య తో నలిగి పోయే భర్త కా సరదాగానూ చేసారు. పూజ కుమార్ అమాయకపు భార్యగా బాగా చేసింది. శ్రద్ధ దాస్ రిపోర్టర్ గా ఒదిగిపోయింది. ఆదిత్ అరుణ్ కంప్యూటర్ హ్యాకర్ గా సరిగ్గా సరిపోయాడు. నాస్సర్, పోసాని మంచి పాత్రల్లో మెరుస్తారు.
చివరి మాట: పి.ఎస్.వి గరుడ వేగా, పేరుకు తగ్గట్లే వేగవంతమైన యాక్షన్ థ్రిల్లర్