పాలు గారే అందాలతో అమ‌లాపాల్..!

ఏమైందో తెలియ‌దు కానీ ఈ మ‌ధ్య అమ‌లాపాల్ త‌న ఇంట్లో కంటే ఎక్కువ‌గా హెడ్ లైన్స్ లోనే ఉంటుంది. ఏదో ఒక‌టి చేసి ఎప్పుడూ వార్త‌ల్లో ఉండ‌టం ఈ భామ‌కు అల‌వాటుగా మారిపోయింది. దానికోసం దేనికైనా సిద్ధం అంటుంది. మొన్న‌టికి  మొన్న ట్యాక్స్ ఎగ్గొట్టిన కేస్ లో పోలీస్ మెట్లు ఎక్కిన అమ‌లాపాల్.. ఆ త‌ర్వాత లైంగిక వేధింపుల కేస్ నెత్తిన వేసుకుంది. ఇక ఇప్పుడు అందాల‌న్నీ ఆర‌బోస్తూ మ‌రోసారి రెచ్చిపోయింది. పెళ్లికి ముందు.. పెళ్లికి త‌ర్వాత అమ్మాయిల్లో మార్పులు వ‌స్తాయంటే ఏమో అనుకున్నారు కానీ ఇప్పుడు అమ‌లాపాల్ ను చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. ఈమెకు ఏదో అయిపోయింది.
హీరోయిన్ గా ఉన్న‌పుడు కూడా ఇంత గ్లామ‌ర్ షో చేయ‌లేదు అమ‌లాపాల్.. కానీ ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్ ను పెళ్లాడి విడాకులు తీసుకున్న త‌ర్వాత మాత్రం అమ‌లాపాల్ లో చాలా మార్పులు వ‌చ్చాయి. అస‌లు భ‌ర్తపై ఉన్న కోపమో.. లేదంటే మ‌రే కార‌ణ‌మో ఏమో గానీ ఇష్ట‌మొచ్చిన‌ట్లు రెచ్చిపోతుంది. ఇదివ‌ర‌క‌టి కంటే రెండింత‌లు అందాలు ఆర‌బోస్తుంది. చిట్టిపొట్టి క్యాస్ట్యూమ్స్ లో సెగ‌లు పుట్టిస్తోంది ఈ బ్యూటీ. ఇప్పుడు మ‌రో మ్యాగ‌జైన్ కోసం అందాలు ఆర‌బోసింది అమలాపాల్. దానికితోడు ఈ మ‌ధ్యే ఓ మ‌ళ‌యాలం సినిమా కోసం ఏకంగా సిగ‌రెట్లు కాలుస్తూ.. మందు తాగుతూ ర‌చ్చ చేసింది. జిమ్ లో తాను చేస్తోన్న వ‌ర్క‌వుట్స్ కూడా తీసి నెట్ లో పెట్టేసింది ఈ కేర‌ళ‌కుట్టి.
అంత‌టితో ఆగ‌కుండా దానికి కొటేష‌న్లు కూడా పెట్టింది అమ‌లాపాల్. ఇక ఇప్పుడు ఎద అందాల‌ను చూపిస్తూ ఉవ్వెత్తున ఎగిసి ప‌డుతున్న అందాల గోదారిని కెమెరాలో బంధించింది అమ‌లాపాల్. త‌న పాలు గారే అందాల‌ను ప్రేక్ష‌కుల‌కు విందుగా పెట్టేసింది. ఈ భామ చూస్తోన్న చూపుల‌కే కుర్రాళ్ల నిద్ర చెడిపోతుంది. మొత్తానికి అమ‌లాపాల్ అందాల ఆర‌బోత‌తో అంద‌రికీ పిచ్చెక్కిపోతుందిప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here