నిలేష్ హీరోగా జ‌యంత్ సి.ప‌రాన్జీ కొత్త చిత్రం `న‌రేంద్ర‌`

`ప్రేమించుకుందాం..రా`, `బావగారూ బాగున్నారా`, `ప్రేమంటే ఇదేరా`, `టక్కరి దొంగ`, `ఈశ్వర్‌`, `లక్ష్మీ నరసింహా`, `శంకర్‌దాదా ఎంబిబిఎస్‌` వంటి హిట్‌ చిత్రాలను రూపొందించిన డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ఇషాన్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `న‌రేంద్ర‌`.
ఈ చిత్రంలో న‌రేంద్ర అనే ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ ద్వారా నిలేష్ అనే హీరోను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు డైరెక్ట‌ర్ జ‌యంత్‌. అలాగే ల్యాక్‌మీ ఫేమ్ ఇజ‌బెల్లా ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతుంది. జ‌న‌వ‌రి నెల‌లో హైద‌రాబాద్‌, గుజ‌రాత్‌ల‌లో నాన్ స్టాప్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. పాకిస్థాన్ నేప‌థ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది.  బాలీవుడ్‌లో `రాయిస్` చిత్రానికి సంగీతం అందించిన రామ్ సంప‌త్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రాజ్ కె.న‌ల్లి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అలాగే సీనియ‌ర్ టెక్నిషియ‌న్ వెంక‌టేశ్వ‌ర‌రావు ఈ చిత్రానికి ఎడిటింగ్ చేస్తుండ‌గా,   వెంక‌ట్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే చిత్రంలో న‌టించే ఇత‌ర న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తారు.
ఈ చిత్రానికి ఫైట్స్: వెంక‌ట్‌,  నిర్మాణం: ఇషాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: జ‌యంత్ సి.ప‌రాన్జీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here