తేజ్ కు బిపి పెరిగిపోతుంది..!


ఇండ‌స్ట్రీలో హిట్లు వ‌చ్చిన‌పుడు ఎవ‌రూ ప‌ల‌క‌రించ‌రు. ఎందుకంటే హిట్ల‌లోనే ఉన్నాడు క‌దా త‌న ప‌ని తాను చేసుకుంటాడులే అని. కానీ ఒక్క ఫ్లాప్ వ‌చ్చిందంటే మాత్రం అంద‌రి చూపు అత‌డి వైపే ఉంటుంది. అలాంటిది వ‌ర‌స‌గా ఐదు ఫ్లాపులు వ‌స్తే.. ఇక ఆ హీరో ఉన్నా కూడా లేన‌ట్లే. ఇప్పుడు సాయి ధ‌రంతేజ్ ప‌రిస్థితి ఇలాగే మారిపోయింది. ఒక‌ప్పుడు ఈయ‌న సినిమా వ‌చ్చిందంటే మినిమ‌మ్ గ్యారెంటీ అనుకునేవాళ్లు.
కానీ ఇప్పుడు వ‌చ్చెళ్లిన‌ట్లు కూడా తెలియ‌డం లేదు. మొన్న వ‌చ్చిన ఇంటిలిజెంట్ అయితే మ‌రీ దారుణంగా క‌నీసం 4 కోట్ల షేర్ కూడా వ‌సూలు చేయ‌లేదు. దాంతో ఇప్పుడు ఎలాగైనా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి మ‌ళ్లీ రేస్ లోకి రావాల‌ని చూస్తున్నాడు సాయి. ఇలాంటి టైమ్ లో క‌రుణాక‌ర‌ణ్ తో సినిమా చేస్తున్నాడు సాయిధ‌రంతేజ్. క‌రుణాక‌ర‌ణ్ అంటేనే ప్రేమ‌క‌థ‌ల స్పెష‌లిస్ట్. ఈయ‌న‌ పేరు విన‌గానే తొలిప్రేమ గుర్తొస్తుంది. ఇప్పుడు కూడా తేజ్ ఐ ల‌వ్ యూ అంటూ సాయిధ‌రంతేజ్ తో ప‌క్కా ప్రేమ‌క‌థ‌నే తెర‌కెక్కిస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.
తొలిప్రేమ త‌ర్వాత ఇన్నేళ్ల‌లో ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ మాత్ర‌మే హిట్ట‌య్యాయి. మిగిలినవ‌న్నీ చేతులెత్తేసిన‌వే. దాంతో క‌రుణాక‌ర‌ణ్ కూడా ఇప్పుడు స్లంప్ లోనే ఉన్నాడు. రెండేళ్ల కింద నితిన్ తో చేసిన చిన్న‌దాన నీ కోసం కూడా డిజాస్ట‌రే. ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా కూడా తొలిప్రేమ ద‌ర్శ‌కుడు అనే ముద్ర ఇప్ప‌టికీ క‌రుణాక‌ర‌ణ్ ను కాపాడుతుంది.
అందుకే ఇప్ప‌టికీ మ‌న హీరోలు అప్పుడ‌ప్పుడూ న‌మ్ముతున్నారు. ఇప్పుడు సాయితో చేస్తున్న తేజ్ ఐ ల‌వ్ యూ టీజ‌ర్ చూస్తుంటే ఇది కూడా ప‌క్కా ల‌వ్ స్టోరీ అని అర్థ‌మైపోతుంది. టీజ‌ర్ లోనే క‌రుణాక‌ర‌ణ్ స్టైల్ క‌నిపించింది. సీనియ‌ర్ నిర్మాత కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి ఇమేజ్ కు త‌గ్గ‌ట్లే ఈ చిత్రం ఉంటుంద‌ని చెబుతున్నాడు క‌రుణాక‌ర‌ణ్. సినిమా కొత్త‌గా ఉండ‌దు కానీ అందంగా ఉంటుంద‌ని చెబుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్. మ‌రి చూడాలి.. ఈ ప్రేమ‌క‌థ‌తో అయినా సాయిధ‌రంతేజ్ ఒడ్డున ప‌డ‌తాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here