జై సింహా.. ర‌చ్చో ర‌చ్చ‌స్య‌.. 

Jai Simha Audio On Dec 24 At Vajra Grounds, Vijayawada – Grand Release On Jan 12, 2018
ఇప్పుడు బాల‌య్య జోరు చూసిన త‌ర్వాత ఈ మాటే అనాలేమో. అస‌లు ఆగ‌డం తెలియ‌ని సింహంలా వేటాడేస్తున్నాడు న‌ట‌సింహం. జై సింహాలో ఆయ‌న జోరు చూసి అభిమానుల‌తో పాటు అంద‌రూ షాక్ అవుతున్నారు. ఏజ్ పెరుగుతుంటే జోరు త‌గ్గుతుంది.. కానీ బాల‌య్య‌లో మాత్రం పెరుగు తున్న వ‌య‌సుతో పాటు జోరు కూడా పెరుగుతూ పోతుంది. లేక‌పోతే ఏంటి.. జై సింహాలో ఆయ‌న చేసిన ఫైట్లు.. డాన్సులు.. క‌థ‌లు చూస్తుంటే కుర్రాళ్లు కూడా కుళ్ల‌కోవాల్సిందే. అస‌లు ఈ హీరో దూకుడు చూసి విజిల్స్ వేయ‌డం త‌ప్ప మ‌రో ఆప్ష‌న్ కూడా లేదు. ట్రైల‌ర్ లో బాల‌య్య యాక్ష‌న్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ ఏజ్ లో ఇలాంటి సీన్స్ చేయ‌డం అనేది నిజంగా సాస‌హమే. కానీ అభిమానుల కోసం దేనికైనా సిద్ధం అంటాడు బాల‌య్య‌. ఇప్ప‌టికే జై సింహా షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉన్నారు చిత్ర‌యూనిట్. డిసెంబ‌ర్ 28న ఈ చిత్ర సెన్సార్ కూడా పూర్తి కానుంది. మొత్తానికి చూడాలిక‌.. జై సింహాతో బాల‌య్య చేయ‌బోయే ర‌చ్చ ఎలా ఉంటుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here