చైతూ-స్యామ్.. ఇప్పుడంతా అఫీషియ‌ల్.. 

 
వ‌చ్చేసింది.. ఆ ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది.. భార్య‌తో క‌లిసి న‌టించాలంటే బ‌ల‌మైన స్క్రిప్ట్ కావాల‌ని అడిగిన నాగ‌చైత‌న్య కోరిక‌ను మ‌న్నించే స్క్రిప్ట్ వ‌చ్చేసింది. నిన్నుకోరి లాంటి సెన్సిబుల్ సినిమా చేసిన శివ‌నిర్వాన ఇప్పుడు అక్కినేని జంట కోసం అద్భుతమైన క‌థ వండుకుని తీసుకొచ్చాడు. చైతూ, సామ్ క‌లిసి న‌టిస్తున్నారంటే ఉండే అంచ‌నాలు వేరుగా ఉంటాయి కాబ‌ట్టే ఇన్ని రోజులు ఎన్ని క‌థ‌లు వ‌చ్చినా వ‌ద్ద‌న్నారు ఈ జంట‌. కానీ ఇప్పుడు కాద‌నలేని క‌థ‌తో వ‌చ్చాడు శివ‌. దాంతో కాద‌న‌లేక క‌మిటైపోతున్నారు ఈ జోడీ. నానితో కృష్ణార్జున యుద్ధం సినిమా నిర్మిస్తోన్న హ‌రీష్ పెద్ది, సాహు గ‌రపాటి నిర్మిస్తున్నారు. మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ చిత్ర అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ వ‌చ్చింది. ఈ చిత్రానికి ప్రేయ‌సి అనే క్లాసీ టైటిల్ ప‌రిశీలిస్తున్నాడు శివ‌. నిన్నుకోరి త‌ర‌హాలోనే ఇది కూడా మ‌న‌సుకు హ‌త్తుకునేలా ఉంటుంద‌ని చెబుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ముందు ఈ చిత్రాన్ని వ‌రుణ్ తేజ్ తో చేయాల‌నుకున్నా.. అనుకోని కార‌ణాల‌తో ఎందుకో అది నాగ‌చైత‌న్య చేతుల్లోకి వ‌చ్చింది. ఇప్పుడు ఇల్లాలే ప్రేయ‌సిగా మార‌డంతో ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగా పెరిగిపోతున్నాయి. మ‌రి ఈ రియ‌ల్ లైఫ్ క‌పుల్ తో క‌లిసి శివ‌నిర్వాన ఏం మాయ చేస్తాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here