కెరీర్ లో ఛ‌లో అంటున్న నాగ‌శౌర్య‌..

 

తెలుగు ఇండ‌స్ట్రీలోకి వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకొచ్చాడు నాగ‌శౌర్య‌. ఊహ‌లు గుసగుస‌లాడే.. దిక్కులు చూడ‌కు రామ‌య్యా.. జో అచ్చుతానంద‌.. క‌ళ్యాణ వైభోగ‌మే లాంటి సినిమాలున్నాయి ఈ హీరో కెరీర్ లో. కానీ ఈ మ‌ధ్య వ‌ర‌స‌గా ప‌రాజ‌యాలు నాగ‌శౌర్య ఇమేజ్ ను బాగా దెబ్బ‌తీసాయి. ఈ మ‌ధ్యే వ‌చ్చిన క‌థ‌లో రాజ‌కుమారి కూడా డిజాస్ట‌ర్ గా నిలిచింది. అయినా నాగ‌శౌర్య కెరీర్ ప్ర‌స్తుతం సంతృప్తిక‌రంగానే సాగుతుంది. ఇప్పుడు ఈ హీరో మూడు సినిమాల్లో న‌టిస్తున్నాడు. త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ కుడుముల‌తో ఛ‌లో సినిమా చేస్తున్నాడు. ఇందులో క‌న్న‌డ సంచ‌ల‌నం ర‌ష్మిక మండ‌న్న హీరోయిన్ గా న‌టిస్తుంది. తెలుగు-త‌మిళ‌నాడు నేప‌థ్యంలో ఈ చిత్ర క‌థ సాగ‌నుంది. ఈ మ‌ధ్యే తాజాగా విడుద‌లైన టీజ‌ర్.. ఇప్పుడు విడుద‌లైన పాట చూస్తుంటే ఛ‌లోపై త‌క్కువ అంచ‌నాలు వేసుకోడానికి అయితే లేదు. క‌చ్చితంగా ఈ చిత్రంతో ఏదో మాయ చేయ‌బోతున్నాడు నాగ శౌర్య‌. డిసెంబ‌ర్ 29న విడుద‌ల కానుంది ఛ‌లో.

"Naga Shaurya & Sai Pallavi Starrer Kanam Trailer"

ఇక ఛ‌లోతో పాటు తాజా సంచ‌ల‌నం సాయిప‌ల్ల‌వితో క‌లిసి క‌రు సినిమాలో న‌టిస్తున్నాడు నాగ‌శౌర్య‌. ఏఎల్ విజ‌య్ దీనికి ద‌ర్శ‌కుడు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతోంది. సాయిప‌ల్ల‌వి ఎంట్రీతో సినిమా రేంజ్ పెరిగింది. ఈ భామకు ఉన్న ఇమేజ్ త‌న‌కు హిట్ తీసుకొస్తుంద‌ని న‌మ్ముతున్నాడు నాగ‌శౌర్య‌. తెలుగులో క‌ణంగా వ‌స్తుంది క‌రు. ఇప్ప‌టి వ‌ర‌కు సాయిప‌ల్ల‌వికి ఫ్లాప్ లేదు. ఈమె ఏ భాష‌లో న‌టించినా.. ఏ సినిమా చేసినా అన్నీ విజ‌యాలే. పైగా సాయిప‌ల్ల‌వి సొంత భాష త‌మిళ్ లో న‌టిస్తున్న తొలి సినిమా క‌రు. దాంతో క‌రుపై అక్క‌డ అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇదే ఊపులో క‌రు కూడా హిట్ అవుతుంద‌ని ఆశిస్తున్నాడు నాగ‌శౌర్య‌. ఇదే జ‌రిగితే కెరీర్ ఛ‌ల్.. ఛ‌లో ఛ‌లో అంటూ పాట‌లు పాడుకోవ‌చ్చు ఈ కుర్ర హీరో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here