కాలా.. 70 కోట్లు కూడా రాలా..!

Rajini Kaalakaala

ర‌జినీకాంత్ సినిమా అంటే టాక్ తో ప‌నిలేకుండా తొలి వారం వ‌సూళ్లు కుమ్మేయాలి. రికార్డుల‌న్నీ తిర‌గ‌రాయాలి. ఆ త‌ర్వాత సినిమా ఫ్లాపైందా.. లేదా అనే ముచ్చ‌ట్ల‌న్నీ..! అప్ప‌టివ‌ర‌కు అయితే క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించాలి క‌దా. లింగా.. కొచ్చాడ‌యాన్.. క‌బాలి లాంటి సినిమాలు కూడా తొలి మూడు రోజులు రికార్డులు తిర‌గ‌రాసాయి. క‌బాలి అయితే యావ‌రేజ్ టాక్ తోనే త‌మిళ‌నాట రికార్డులు తిర‌గ‌రాసింది.

ఆ చిత్రం మిగిలిన భాష‌ల్లో ఫ్లాప్ కానీ త‌మిళ్ లో మాత్రం హిట్. అయితే ఇప్పుడు కాలా ప‌రిస్థితి మాత్రం దానికి భిన్నంగా ఉంది. ఈ చిత్రం తొలి వారం వ‌సూళ్లు క‌నీసం 70 కోట్లు కూడా రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. ర‌జినీకాంత్ సినిమాల్లో ఇది చాలా అంటే చాలా త‌క్కువ వ‌సూళ్లు. క‌బాలి మూడు రోజుల్లోనే 124 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. కానీ ఇప్పుడు కాలా తొలి వారం మొత్తం క‌లిపి కూడా 70 కోట్లు షేర్ తీసుకురాలేదు.

ఓవ‌రాల్ గా ఇప్ప‌టి వ‌ర‌కు 120 కోట్ల గ్రాస్ కూడా దాట‌లేదు ఈ చిత్రం. ఈ తీరు చూస్తుంటే లింగా కంటే పెద్ద డిజాస్ట‌ర్ గా కాలా అవ‌త‌రించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని 155 కోట్ల‌కు అమ్మారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే అందులో స‌గం కూడా తీసుకొచ్చేలా లేదు ఈ చిత్రం. మ‌రి దీనికి ర‌జినీ ఎలాంటి రీ ఫండ్ ఇస్తాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here