కాపులను బి.సి. లో కలపడానికి డెడ్ లైన్!

కాపులను బి.సి. లో కలపడానికి డెడ్ లైన్ ప్రకటించి ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు కాపు నేత ముద్రగడ పద్మనాభం. ఆదివారం నాడు విశాఖపట్నం కాపు సంఘ నాయకులతో మీటింగ్ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంలో మాట్లాడిన ముద్రగడ కాపులను బి.సి లో కాల్పుతున్నట్లు ప్రభుత్వం డిసెంబర్ 6 లోపల ప్రకటించక పోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

జరగబోయే విపరీత పరిణామాలకు ప్రభుత్వమే భాద్యత వహించాలని చెప్పారాయన. టీడీపీ పాలన లోకి వచ్చి మూడు సంవత్సరాలైనా ఇంతవరకు కాపులకు ఇచ్చిన హామీ నెరవేర్చక పోవడం పై అసహనం వ్యక్తపరిచారు ముద్రగడ. చంద్రబాబు నాయుడు పదవి లోకి రావడానికి తమ కులస్థులను మభ్య పెట్టి ఓట్లేయించుకున్నారని, పదవి లోకి రాగానే వారిని మోసం చేసారని దుయ్యబట్టారు ముద్రగడ.

డిసెంబర్ 6 అంబెడ్కర్ వర్ధంతి కావున ఆ రోజును డెడ్ లైన్ గా ఎన్నుకున్నామని చెప్పారు. ముద్రగడ కృష్ణ , గుంటూరు మరియు ఉభయ గోదావరి జిల్లాలో 400 కిలోమీటర్ల పొడవునా పాదయాత్ర చేయాలనీ తలిచారు అయితే ఆంధ్ర పోలీసులు పర్మిషన్ నిరాకరించడం తో అది సాధ్య పడలేదు. ఆగష్టు లో ఆయన్ను హౌస్ అరెస్ట్ కూడా చేసారు. జనుఅరీ 2016 లో కాపు ఉద్యమకారులు తుని లో రత్నాచల్ ఎక్ష్ప్రెస్స్ రైలును తగలబెట్టిన సంగతి గుర్తుచేసుకోవాలి.