అ..! సినిమా రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date
20180216

Critic Reviews for The Boxtrolls

రివ్యూ: అ..!
న‌టీన‌టులు: కాజ‌ల్, ప్రియ‌ద‌ర్శి, నిత్యామీన‌న్, నాని, ర‌వితేజ, ఇషారెబ్బా, ముర‌ళి శ‌ర్మ త‌దిత‌రులు
నిర్మాత‌: నాని, ప్ర‌శాంతి
క‌థ, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: ప‌్ర‌శాంత్ వ‌ర్మ‌
అ..! సినిమా గురించి న‌డిచినంత చ‌ర్చ ఈ మ‌ధ్య కాలంలో దేనికి న‌డ‌వ‌లేదు. స్వ‌యానా నిర్మాత నానినే ఇది పిచ్చి సినిమా అని చెప్పాడు. మ‌రి ఆయ‌న చెప్పినంత పిచ్చి ఈ సినిమాలో ఉందా..? అస‌లు అ.. సినిమా ఎలా ఉంది..? నిర్మాత‌గా నాని ప్ర‌య‌త్నం ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అయింది..?
క‌థ‌:
పెళ్లి గురించి పేరెంట్స్ తో మాట్లాడ‌టానికి ఓ హోట‌ల్ కు వ‌స్తుంది రాధా (ఇషారెబ్బా). అన్నీ మాట్లాడుకుని పేరెంట్స్ కూడా ఒప్పుకున్న త‌ర్వాత రాధ ప్రేమించింది అబ్బాయిని కాదు అమ్మాయిని అని తెలుస్తుంది. ఆమె పేరు కృష్ణ‌(నిత్యామీన‌న్).. సైక్రియాట్రిస్ట్. చిన్న‌ప్ప‌ట్నుంచే మ‌గ‌వాళ్లంటే అస‌హ్యప‌డే రాధాను కృష్ణ ధైర్యం చెబుతుంది. దాంతో ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌తారు. అదే స‌మ‌యంలో మోసం చేసి చెఫ్ అవుతాడు న‌ల్ల(ప్రియ‌ద‌ర్శి). అత‌డికి చేప‌(నాని), చెట్టు(ర‌వితేజ‌) హెల్ప్ చేస్తుంటాయి. అదే స‌మ‌యంలో రాధ‌(ఇషారెబ్బా) కృష్ణ‌(నిత్యామీన‌న్) ను ప్రేమిస్తున్నాని చెబుతుంది. మ‌రోవైపు మీరా(రెజీనా) బాయ్ ఫ్రెండ్ తో దొంగ‌త‌నానికి ట్రై చేస్తుంటుంది. యోగి(ముర‌ళీశ‌ర్మ‌) ఏమో ఓ మెజిషియ‌న్. చిన్న‌పిల్ల‌తో పంథానికి పోతుంటాడు. శ్రీ‌ని అవ‌స‌రాల సైంటిస్ట్. అదే స‌మ‌యంలో కాళి(కాజల్) సూసైడ్ చేసుకోడానికి ప్ర‌య‌త్నిస్తుంటుంది. అస‌లు వీళ్లంద‌రికీ ఎలా క‌నెక్ష‌న్ ఉంది అనేది అస‌లు క‌థ‌..
క‌థ‌నం:
కొన్ని విచిత్రాలు చూసిన‌పుడు మ‌న‌కు తెలియ‌కుండానే అ..! అంటాం. ఆశ్చ‌ర్యానికి గుర్తు అదే.. ఇప్పుడు నాని కూడా ఇదే చేసాడు. అ.. సినిమా చూసిన త‌ర్వాత ప్రేక్ష‌కుల‌కు క‌లిగిన ఫీలింగ్ ఇదే. చాలా మందికి ఈ చిత్రం పెద్ద‌గా న‌చ్చ‌క‌పోయుండొచ్చు ఎందుకంటే ఇది తీసిన తీరు అలా ఉంది మ‌రి. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులోనే కాదు.. ఇండియ‌న్ స్క్రీన్ పై కూడా ఇలాంటి సినిమా ఒక‌టి వ‌చ్చింద‌నే విష‌యం కూడా చాలా మంది తెలియ‌దు. స్క్రీన్ పై ఏదో జ‌రుగుతుంది.. కానీ ఏం జ‌రుగుతుందో క్లారిటీ ఉండదు.. క‌థ‌లోకి ఏవేవో కారెక్ట‌ర్స్ వ‌స్తూ ఉంటాయి.. ఏవేవో చేస్తుంటాయి. కానీ ఏం చేస్తున్నాయ‌ని అర్థం కాదు. క‌థ ఎక్క‌డో మొద‌ల‌వుతుంది.. ఇంకెక్క‌డో ఎండ్ అవుతుంది. రెగ్యుల‌ర్ సినిమాలకు అల‌వాటు ప‌డిన ప్రేక్ష‌కుల బుర్ర‌ల దుమ్ము దులిపేస్తుంది అ..! అస‌లేం చూస్తున్నామో అర్థం కాక అప్పుడ‌ప్పుడూ బుర్ర వేడెక్కుతుంది కూడా. ఇలాంటి సినిమా నాని ఎందుకు నిర్మించాడ్రా బాబూ అనుకుంటాం కూడా. అంత పిచ్చిగా ఉంటుంది ఈ చిత్రం.. అలాగ‌ని బాలేద‌ని ఇలాంటి సినిమాను డిసైడ్ చేయ‌డం క‌ష్టం. ద‌ర్శ‌కుడు కొత్త ఐడియాతో వ‌చ్చాడు.. కానీ అది న‌చ్చుతుందో లేదో చెప్ప‌డం క‌ష్టం. నాని చెప్పింది క‌రెక్టే.. ఇది ఓ పిచ్చి సినిమా.. భ‌రించ‌లేనంత పిచ్చి సినిమా. క‌థ‌లోకి ఒక్కో కారెక్ట‌ర్ రావ‌డం.. వ‌స్తుండ‌టంతోనే విచిత్రంగా బిహేవ్ చేయ‌డం.. ఆ క‌థ ఎక్క‌డికి వెళ్తుందో అర్థం కాక‌పోవ‌డంతో ప్రేక్ష‌కుల‌కు పిచ్చెక్క‌డం ఖాయం. అంత కొత్త‌గా ఉంటుంది ఈ చిత్రం. ఇంట‌ర్వెల్.. క్లైమాక్స్ ఎపిసోడ్స్ మాత్రం సినిమాకు హైలైట్.
న‌టీన‌టులు:
ఇందులో అంద‌రి పాత్ర‌లు త‌క్కువ నిడివితోనే ఉంటాయి. కాజ‌ల్ చాలా బాగా చేసింది. ఆమె పాత్రే సినిమాకు కీల‌కం. కానీ అంద‌రికంటే త‌క్కువగా క‌నిపించేది ఆమె. ఇక నిత్యామీన‌న్ డేరింగ్ ఉన్న పాత్ర‌లో న‌టించింది. ఇలాంటి పాత్ర చేయ‌డానికి కూడా ధైర్యం కావాలి. ఇషారెబ్బా ల‌వ‌బుల్ గా ఉంది. ప్రియ‌దర్శి చేప‌, చెట్టుతో కామెడీ బాగానే చేసాడు. ముర‌ళీ శ‌ర్మ మెజీషియ‌న్ గా బాగా న‌టించాడు. ఇక రెజీనా డ్ర‌గ్స్ కు అల‌వాటు ప‌డిన అమ్మాయిగా సూప‌ర్ గా చేసింది. శ్రీ‌నివాస్ అవ‌స‌రాల ఉన్న‌ది కాసేపే అయినా అద్భుతంగా న‌టించాడు. ఇలా ఎవ‌రికి వాళ్లు సినిమాలో త‌మవంతు పాత్ర‌లు బాగానే చేసారు.
టెక్నిక‌ల్ టీం:
ఈ సినిమాకు సంగీతం కీల‌కం. కొత్త సంగీత ద‌ర్శ‌కుడు మార్క్ ఏ రాబిన్ త‌న బ్యాగ్రౌండ్ స్కోర్ తో అల‌రించాడు. ఇక కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. ఉన్నంత‌లో చాలా బాగా చూపించాడు సినిమాను. నిర్మాణ విలువ‌లు కూడా బాగున్నాయి. ఇక ద‌ర్శ‌కుడి గురించి చెప్పుకోవాలి. ఇంత కాంప్లికేటెడ్ క‌థ‌ను ప్ర‌శాంత్ చేయాల‌నుకోవ‌డ‌మే సాహ‌సం. కానీ దాన్ని తెర‌కెక్కించ‌డంలో ఇంకాస్త ఆక‌ట్టుకుని ఉంటే బాగుండేది. చాలా చోట్ల క‌థ అర్థ‌మే కాదు. ఏం జ‌రుగుతుందో తెలియ‌దు. సుకుమార్ అనుకుంటే ఆయ‌న‌కు తాత‌లా మారిపోయాడు ప్రశాంత్.
చివ‌ర‌గా:
అ.. క్రియేటివిటీ @ పీక్స్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here