అల్లుఅర్జున్ తో అట్లీకుమార్..

Allu Arjun
అట్లీకుమార్.. త‌మిళ ఇండ‌స్ట్రీలో ఈ పేరు ఇప్పుడు ఓ సంచ‌ల‌నం. చేసింది మూడు సినిమాలే కానీ మూడు బ్లాక్ బ‌స్ట‌ర్లే. ఒక‌టేమో ల‌వ్ స్టోరీ.. మ‌రొక‌టి యాక్ష‌న్.. ఇంకొక‌టి మెడికల్ మాఫియా.. ఇలా ఒక్కో జోన‌ర్ లో ఒక్కో సినిమా చేసి ఇప్పుడు సౌత్ ఇండ‌స్ట్రీని ఊపేస్తున్నాడు అట్లీకుమార్. మెర్స‌ల్ సినిమాతో ఈ మ‌ధ్యే హ్యాట్రిక్ పూర్తి చేసాడు. ఈ చిత్రం ఏకంగా 240 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేసింది. దాంతో అట్లీకుమార్ పేరు మారుమోగిపోతుంది. ఉన్న‌ఫ‌లంగా తెలుగు ఇండ‌స్ట్రీకి అట్లీని ఎత్తుకొచ్చేయాల‌ని తెలుగులో కొంద‌రు హీరోలు, నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ కుర్ర ద‌ర్శ‌కుడితో ప‌ని చేయ‌డానికి మ‌న హీరోలు కూడా ఆస‌క్తి చూపిస్తున్నారు.
సోష‌ల్ ఇష్యూ ల‌ను క‌మ‌ర్షియ‌ల్ గా చెప్ప‌డంలో అట్లీ త‌న‌దైన ముద్ర వేస్తున్నాడు. దాంతో అట్లీ టేకింగ్ కు ఫిదా అయిన మ‌న హీరోలు.. తెలుగులోకి మ‌నోడిని తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈయ‌న కూడా ఇప్పుడు ఇదే విష‌యం క‌న్ఫ‌ర్మ్ చేసాడు. త‌న త‌ర్వాతి సినిమా తెలుగులో ఉంటుంద‌ని.. ఓ పెద్ద హీరోతో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని ఈ మ‌ధ్యే ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు అట్లీకుమార్. ఆ పెద్ద హీరో బ‌న్నీ అని తెలుస్తుంది. ఇప్ప‌టికిప్పుడు అట్లీ కోసం ఖాళీ అయ్యే హీరోలెవ‌రు తెలుగులో లేరు. అంతా రెండు మూడు సినిమాల‌తో బిజీగా ఉన్న‌వాళ్లే. ఒక్క అల్లుఅర్జున్ మాత్ర‌మే నా పేరు సూర్య త‌ర్వాత ఏ సినిమా క‌న్ఫ‌ర్మ్ కాలేదు. దాంతో ఆ హీరో బ‌న్నీనే అని తెలుస్తుంది. కొన్ని రోజులు ఆగితే పూర్తి క్లారిటీ ఇస్తాన‌ని చెప్పాడు అట్లీకుమార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here