హెబ్బాప‌టేల్.. ముద్దుల ప్రియురాలు..!

24 Kisses
అవును.. అప్ప‌ట్లో వెంక‌టేశ్ ముద్దుల ప్రియుడు అయితే ఇప్పుడు హెబ్బాప‌టేల్ ముద్దుల ప్రియురాలు అయిపోయింది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ప్ర‌స్తుతం ఈ భామ న‌టిస్తున్న సినిమా పేరు 24 కిస్సెస్. అక్ష‌రాలా 24 ముద్దులు అని అర్థం. ఇందులో లిప్ లాక్ సీన్స్ తో రెచ్చిపోడానికి రెడీ అయింది ఈ కుమారి. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా త‌ర్వాత హెబ్బాకు స‌రైన స‌క్సెస్ రాలేదు. దాంతో హాట్ ఫోటోషూట్ల‌తో కాలం గ‌డిపేస్తుంది ఈ భామ‌. దానికితోడు అమ్మాయి ఫుల్ గా బ‌రువు పెరిగిపోయి చూడ‌లేని విధంగా మారిపోయింది. ఇలాంటి టైమ్ లో 24 కిస్సెస్ అంటూ వ‌స్తుంది ఈ భామ‌. ఈ సినిమాలో కుమారిని మించి గ్లామ‌ర్ పంచ‌డానికి వ‌స్తుంది హెబ్బా.
మిణుగురులు ఫేమ్ అయోధ్య కుమార్ దర్శకత్వంలో హెబ్బా పటేల్ శ్రీలక్ష్మీ అండ్ 24 కిసెస్ అనే సినిమాలో న‌టిస్తుంది. టైటిల్ కు త‌గ్గ‌ట్లే ఈ చిత్రంలో 24 ముద్దు సీన్లు ఉంటాయని తెలుస్తుంది. అందుకే ఈ సినిమా కు ఆ టైటిల్‌ను ఫిక్స్ చేసారు. ఆ 24 ముద్దులకు ఉండే లింక్ ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నాడు ద‌ర్శ‌కుడు. ఇక ఈ చిత్రం గురించి హెబ్బా చెబుతూ.. కుమారి 21 ఎఫ్ తరహాలోనే 24 కిసెస్ లోనూ త‌న‌ది బోల్డ్ కారెక్ట‌ర్ అంటుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి ఈ స్పైసీ కారెక్ట‌ర్ అయినా హెబ్బాను ఒడ్డున ప‌డేస్తుందో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here