స‌రికొత్త సునీల్ ను చూస్తున్నారా..?


స‌రికొత్త సునీల్ ఏంటి.. మ‌ళ్లీ సిక్స్ ప్యాక్ కానీ చేస్తున్నాడా ఏంటి అనుకుంటున్నారా..? ఏం లేదండీ క‌మెడియ‌న్ సునీల్ అన్న‌మాట‌. ఇన్నాళ్లూ హీరోగా ఉన్నాడు క‌దా.. ఇప్పుడు క‌మెడియ‌న్ అయిపోయాడు. ఈయ‌న రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత చేస్తోన్న సినిమాల‌న్నీ ఇప్పుడు వేగంగా షూట్ జ‌రుపుకుంటున్నాయి. ఇప్పుడు అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమాలోని స్టిల్ ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది. సునీల్ తో పాటు శ్రీ‌నివాస రెడ్డి.. మ‌రికొంద‌రు క‌మెడియ‌న్లు కూడా ఇందులో ఉన్నారు.
అప్పుడెప్పుడో 2013లో పూల‌రంగ‌డితో వ‌చ్చిన విజ‌యం.. మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. ఈ ఐదేళ్ల‌లో ఎన్ని సినిమాలు చేసినా ప్రేక్ష‌కులు మాత్రం సునీల్ ను చూడ‌లేక‌పోయారు. దాంతో మ‌ళ్లీ క‌మెడియ‌న్ గా ఎంట్రీ ఇస్తున్నాడు సునీల్. ఈ విష‌యంలో చాలా సీరియ‌స్ గా ఉన్న సునీల్.. రీ ఎంట్రీని మాత్రం ఘ‌నంగా ప్లాన్ చేసుకుంటున్నాడు.
అదేం విచిత్ర‌మో కానీ ఇండ‌స్ట్రీలో ఎప్పుడు ఎవ‌రిపై రాన‌న్ని గాసిప్స్ అన్నీ సునీల్ పైనే వ‌స్తుంటాయి. ఈయ‌న చూడ్డానికి చాలా కామ్ గా ఉంటాడు కానీ గాలి వార్త‌లు మాత్రం భీమ‌వ‌రం బుల్లోడిపైనే వ‌స్తుంటాయి. దానికి కార‌ణం ఏంటో త‌న‌కు కూడా తెలియ‌దంటున్నాడు ఈ హీరో. అయితే ఈ గాసిప్స్ మాత్రం తాను కూడా ఎంజాయ్ చేస్తానంటున్నాడు సునీల్. ఆ మ‌ధ్య అజ్ఞాత‌వాసిలో సునీల్ కోసం త్రివిక్ర‌మ్ ఓ రోల్ రాసాడు.
కానీ బిజీ కార‌ణంగా అది వ‌దిలేసాడు. అయితే అజ్ఞాత‌వాసి మిస్సైనా.. ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమాలో న‌టిస్తున్నాడు. ఇక దాంతోపాటు శీనువైట్ల‌-ర‌వితేజ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ.. శ‌ర్వానంద్ ప‌డిప‌డి లేచే మ‌న‌సు.. అల్ల‌రిన‌రేష్ సిల్లీఫెల్లోస్ లాంటి సినిమాల్లో న‌టిస్తున్నాడు సునీల్. ఇక ఇప్పుడు సాయిధ‌రంతేజ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కించ‌బోయే చిత్ర‌ల‌హ‌రి.. బార్ అండ్ రెస్టారెంట్ లో కూడా న‌టిస్తున్నాడు. మ‌రి వీటితో మ‌నోడి కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డిన‌ట్లేనా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here