స్పైడర్ రివ్యూ

MOVIE METER

Average Rating: 3
Total Critics: 1

AUDIENCE SCORE

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

స్పైడర్ అక్కడక్కడా ఆశ్చర్యపరిచినా, మొత్తం మీద నిరాశ మిగిల్చింది

Rating: 2.75/5

www.teluguodu.com

Release Date : 09/27/2017

తారాగణం: మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జె సూర్యహ్, ప్రియదర్శి

దర్శకత్వం: ఏ ఆర్ మురుగదాస్

సంగీతం: హర్రీస్ జయరాజ్

నిర్మాత: టాగోర్ మధు, యెన్ వి ప్రసాద్

బ్యానర్ : NVR సినిమా

కథ:

శివ (మహేష్) ఇంటలిజెన్స్ బూరెలు కాల్ సెంటర్ లో పని చేస్తుంటాడు. ప్రజల ఫోన్ కాల్స్ టాప్ చేసి వారికీ వచ్చే ఆపడాలనుండి కాపాడుతుంటాడు.

అతని అరహతకి, మేధస్సు కు సరితూగని ఉద్యోగమైనా ఎదుటి వారికీ సహాయం చేయడంలో సంతృప్తి వెతుకుతుంటాడు శివ. ఒకానొక రోజు, అతను ఓ చిత్రమైన ఫోన్ వింటాడు. నగరంలో వరుస హత్యలు జరుగుతున్నాయని, వాటన్నిటికీ కారణం భైరవ అనే శాడిస్ట్ అని తెలుసుకుంటాడు.

భైరవ నగరంలో వందలమంది ని చంపి భయానకం సృష్టించే వ్యూహంలో ఉంటాడు. భైరవ ఆలా ఎందుకు మారతాడు? శివ అతని ప్లాన్ ను ఛేదించి, ప్రజలను ఎలా కాపాడుతాడు? అనే ఆసక్తి కర విషయాలు తెర మీద చూడాల్సిందే.

కథనం:

స్పైడర్ కథ కంటే కధనాన్ని నమ్ముకుని తెరకెక్కిన చిత్రం. ఆరంభంలో నెమ్మది సాగుతుంది. శివ క్యారెక్టర్ పరిచయం చేయడం, రకుల్ తో ప్రేమ పాటలు తో స్లో గా సాగుతుంది. మర్డర్ మిస్టరీ ప్రారంభం కావడంతో ఆసక్తికరంగా మారుతుంది కథ. విల్లన్ ఎంట్రీ తో అది ఆకాశానికి లేస్తుంది. విల్లన్ చిత్రమైన ఫ్లాష్ బ్యాక్ తో అతని కథను కొత్త మూడ్లోకి తీసుకు వెళ్తాడు దర్శకుడు.

మాములుగా ఇంటర్వెల్ లో బ్యాంగ్ ఉంటుంది, కానీ స్పై డర్ లో ఇంటర్వెల్ తర్వాత బ్యాంగ్ ఉంటుంది. ద్వితీయార్ధం లో వచ్చే కొన్ని సన్నివేశాలు ఊహకందని విధంగా ఉండి గోళ్లు కొరుక్కునే రేంజ్ లో థ్రిల్లింగ్ ఉంటాయి. హీరో – విల్లంకి మధ్య వచ్చే మైండ్ గేమ్ ఇంటెలిజెంట్ గా ఉంటుంది. అయితే దర్శకుడు అదే టెంపోని చివరి వరకు మైంటైన్ చేయడం లో తడబడ్డాడు. మురుగదాస్ మార్క్ మనసు కు హత్తుకొనే సెంటిమెంట్ సన్నివేశాలు అడపా తడప ఉన్నాయి.

సాంకేతికత:

ముందుగా చెప్పుకోవలసింది సంతోష్ శివన్ కెమెరా పనితనం, అధిభూతమని చెప్పాలి, కొన్ని ఆక్షన్ ఎపిసోడ్స్ పిక్చరైజేషన్ అబ్బురపరుస్తాయి. హర్రీస్ జయరాజ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాల కొత్తగానూ, చిత్రంలోని థ్రిల్లింగ్ ఫీల్ ను పెంచే విధంగా ఉంది. గ్రాఫిక్స్ పర్వాలేదనిపించింది.

తారాబలం:

స్పై పాత్రలో మహేష్ బాబు నటన అమోఘం. ముఖంలో టెన్షన్ ని మైంటైన్ చేసిన తీరు సూపర్బ్. ఆలోచిస్తూ డైలాగ్ చెప్పిన విధానం ఓ ఇంటెలిజెంట్ పర్సనాలిటీ కి నిదర్శనం. మహేష్ పాత్రకి న్యాయం చేయడమే కాకుండా రక్తి కట్టించాడని చెప్పాలి. ఆయనకు ధీటుగా ఎస్ జె సూర్యహ్ విల్లన్ గా అదరగొట్టాడు. ఇంతకు ముందెన్నడూ చూడని విల్లన్ పాత్ర అది. రకుల్ కి కథలో ప్రాధాన్యం లేని పాత్ర. ఇతర నటులకు కూడా పెద్దగా ఆస్కారం లేదు.

ఎం బాగున్నాయి?

స్పై డర్ మామూలు గా తెలుగు లో వచ్చే హీరో ని ఎలేవేటే చేసే మాస్ చిత్రం కాదు. ప్రతి మనిషిలోనూ కొంత శాడిజం ఉంటుంది అనే చిత్రమైన పాయింట్ ను టచ్ చేస్తూ కొత్త పంధాలో సాగే చిత్రమిది. స్పైడర్ అందరు అనుకున్నట్లు ఏ జేమ్స్ బాండ్ చిత్రమో లేక హాలీవుడ్ సూపర్ హీరో చిత్రమో కాదు. స్పై డర్ సాధారణ జీవతాల్లో రోజు చూసే కష్టాలను స్పృశిస్తూ సహజత్వానికి దగ్గరగా తీసాడు దర్శకుడు. ప్రతి విషయానికి పరిగెత్తకుండా, హీరో టెక్నాలజీని వాడుకుని సగటు జనాలు, మహిళలను తన మిషన్ లో ఉపయోగించే పద్ధతి బాగుంటుంది.

ఏది బాగాలేదు?

చిత్రం లో తమిళ్ నేటివిటీ ఎక్కువగా కనిపిస్తుంది. జూనియర్ ఆర్టిస్టులు ఓవర్ ఆక్షన్ చేసినట్లుంటుంది. కామెడీ పండలేదు. రకుల్ పాత్రకు ప్రాధాన్యత లేకపోవడం.

చివరి మాట: స్పైడర్ అక్కడక్కడా ఆశ్చర్యపరిచినా, మొత్తం మీద నిరాశ మిగిల్చింది