సూర్య.. భ‌ర‌త్ కు సిట్టిబాబు స‌వాల్..


బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఇప్పుడు ఒకే ఒక్క సినిమా పేరు వినిపిస్తుంది. అదే రంగ‌స్ధ‌లం. ఎక్క‌డ చూసినా ఈ చిత్ర క‌లెక్ష‌న్ల‌తోనే బాక్సాఫీస్ ఊగిపోతుంది. రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని రికార్డుల‌ను ఈ చిత్రం సృష్టిస్తుంది. ఐదు రోజుల్లోనే 70 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసి నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో ఆల్ టైమ్ ఇండ‌స్ట్రీ హిట్ దిశ‌గా అడుగేస్తుంది. చిరంజీవి ఖైదీ నెం.150 పేరు మీద ఇప్ప‌టి వ‌ర‌కు ఫ‌స్ట్ వీక్ రికార్డులున్నాయి. ఆ సినిమా 76 కోట్లు వ‌సూలు చేసింది. ఇప్పుడు చూస్తుంటే దీన్ని దాటేసేలా క‌నిపిస్తుంది రంగ‌స్థ‌లం. ఓవ‌ర్సీస్ లోనూ 3 మిలియ‌న్ వైపు అడుగేస్తున్నాడు ఈ చిట్టిబాబు. రంగ‌స్థ‌లం సృష్టించే ఒక్కో రికార్డ్ ఇప్పుడు భ‌ర‌త్ అనే నేనుతో పాటు నా పేరు సూర్య‌కు స‌వాల్. ఎందుకంటే స్పైడ‌ర్.. బ్ర‌హ్మోత్స‌వం అక్క‌డ అత్యంత దారుణంగా బ‌య్య‌ర్ల‌ను ముంచేసాడు మ‌హేశ్. బ‌న్నీ కూడా డిజేతో కాస్త నిరాశ‌ప‌రిచాడు. కానీ క‌మ‌ర్షియ‌ల్ గా అల్లుఅర్జున్ రైజింగ్ లో ఉన్నాడు. దాంతో సిట్టిబాబు స‌వాల్ అల్లువార‌బ్బాయి ఇమేజ్ కు ప్ర‌శ్న‌గా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు నాన్ బాహుబ‌లి రికార్డుల‌న్నీ చిరంజీవి ఖైదీ నెం.150 పేరు మీదున్నాయి. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ వాటిని తీసుకునేలా క‌నిపిస్తున్నాడు. దాంతో ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను.. నా పేరు సూర్య హిట్ కొట్టాలంటే ముందు సిట్టిబాబును దాటాలి. అలా దాటితే కానీ అవి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అవ్వ‌వు. చూడాలిక‌.. సిట్టిబాబు స‌వాల్ ను ఈ హీరోలు ఎంత‌వ‌ర‌కు తీసుకుంటారో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here