సింగం3 మూవీ రివ్యూ

MOVIE METER

Average Rating: 3
Total Critics: 5

AUDIENCE SCORE

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

ఈ సారి గర్జించలేక పోయిన సింగం

Rating: 2.5/5

www.teluguodu.com

ఎస్‌ 3ది 4జి స్పీడు!

Rating: 2.75/5

greatandhra.com/

అదే సింగం.. అదే దూకుడు

Rating: 2.75/5

http://www.tupaki.com/

ఎనర్జిటిక్ యూనివర్సల్ కాప్

Rating: 2.5/5

http://www.indiaglitz.com

‘యాక్షన్’ ప్రియులకు మాత్రమే!

Rating: 2.75/5

http://www.123telugu.com/

Release Date : 02/09/2017

నటులు: సూర్య, శృతి హాసన్, అనుష్క

డైరెక్టర్: హరి

మ్యూజిక్: హార్రీస్ జైరాజ్

ప్రొడ్యూసర్: కె ఈ జ్ఞానవేల్ రాజా

బ్యానర్: స్టూడియో గ్రీన్

స్టోరీ:

నర సింహం (సూర్య) స్పెషల్ డెప్యూటేషన్ పై కర్ణాటకకు ట్రాన్స్ఫర్ అవుతాడు. ఒక హై ప్రొఫైల్ కేసుపై తనని నియమిస్తారు. నర సింహం ఒక బ్యూటిఫుల్ గర్ల్ జర్నలిస్ట్ విద్య (శృతి హాసన్) ని మీట్ అవుతాడు, తను అతని వెనుక పడుతుంది మరియు అతన్ని తన మిషన్ నుంచి దృష్టి మళ్ళిస్తుంది. ఒక రోజు పోలీస్ కమీషనర్ చంప బడతాడు.

నర సింహం చంపిన వాళ్ళ కోసం వేటాడుతుంటాడు. ఇంటర్నేషనల్ సంచలనాత్మక క్రిమినల్ విట్టల్ (అనూప్ సింగ్) కర్ణాటక పాలిటిక్స్ ని నడిపిస్తుంటాడు. స్టేట్స్ లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ సమస్యలో పడుతుంది. నర సింహం కమీషనర్ మర్డర్ తో జర్నలిస్ట్ విద్యకి కనెక్షన్ ఉందని అరెస్ట్ చేయడంతో కథ మలుపు తిరుగుతుంది.

కమీషనర్ మర్డర్ వెనకున్న రహస్యమేంటి ? జర్నలిస్ట్ విద్య నిజంగా ఇందులో ప్రమేయం కలిగి ఉందా ? అసలు అపరాధులైన వాళ్ళను నర సింహం పట్టుకున్నాడా ? వీటిని ఆస్ట్రేలియా నుంచి నడిపిస్తున్న విట్టల్ దగ్గరకు అతను ఎలా చేరుకుంటాడు మరియు అతని క్రిమినల్ సామ్రాజ్యాన్ని ఎలా నాశనం చేసాడు ? వీటికి సమాధానం కావాలంటే సింగం 3 చూడాల్సిందే.

సమీక్ష:

సింగం ముందు రెండు సినిమాలు సక్సెస్ కావడంతో సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ అయింది. ఈ సిరీస్ బాలీవుడ్ లో కూడా తెరకెక్కించారు. తీవ్రమైన పోలీస్ గా సూర్య క్యారెక్టర్ సక్సెస్ అయింది. మొదటి భాగం గ్రామీణ నేపథ్యంలో సెట్ చేయడం వల్ల ప్రత్యేకం. రెండో భాగం ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ ని డీల్ చేసే వైపు వెళ్తుంది.

సింగం 3 ఎక్కువ లేదా తక్కువ రెండో భాగం లైన్ లో ఉంటుంది. స్టోరీలో కొత్తదనమేమి లేదు. డైరెక్టర్ స్క్రీన్ప్లే ని అటు ఇటు తిప్పి విభిన్నంగా చూపించే ప్రయత్నం చేసాడు. సస్పెన్స్ అంశాలు మరియు పదునైన మలుపులు అదనంగా జోడించడంతో ప్రయోజనం పనిచేసింది. కానీ ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. అనవసర సన్నివేశాలతో స్టోరీని చెడగొట్టారు. మొదటి భాగం పరవలేనప్పటికీ రెండో భాగం సింగం1 అండ్ సింగం2 లాంటి పదే పదే వచ్చే సన్నివేశాలు చిరాకు తెప్పిస్తాయి.

కమెడియన్ సూరి సిల్లీ కామెడీ మరియు శృతి హాసన్ అందం ఫస్ట్ హాఫ్ ని నడిపించింది. సరైన సందర్భంలో రాని సాంగ్స్ సినిమా టెంపోని చంపేశాయి. విలన్ అనూప్ సింగ్ పవర్ఫుల్ ఇంటర్నేషనల్ డాన్ గా మంచి స్క్రీన్ ప్రెజన్స్ పొందాడు. కానీ తన స్కిల్స్ ప్రదర్శించడానికి తగిన రోల్ లేదు. ఇంటర్వెల్ తర్వాత, రహస్యం బయటపడడంతో మిగతా కథ గ్రహించడం తేలికవుతుంది.

హెవీ స్టంట్ ఎపిసోడ్స్ భూమింగ్ సౌండ్స్ తో సినిమాకు యాక్షన్ ఫ్లేవర్ ఇచ్చారు. కానీ సరైన స్టోరీ కాకపోవడం నిరుత్సాహపరిచింది. సూర్య నటన గురించి చెప్పే అవసరం లేదు. పోలీస్ ఆఫీసర్ గా తన పెర్ఫార్మన్స్ అద్భుతంగా ఉంది. తన డబ్బింగ్ చాలా గట్టిగా ఉంది. పేలవంగా రాసిన డైలాగ్స్ 1990 పోలీస్ డ్రామా చూస్తున్నట్టుగా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ సన్నివేశం ఇంటలిజెన్స్ అండ్ కిక్ లోపించింది.

అనుష్క పాత్ర తక్కువగా ఉంది. సినిమా కొనసాగింపు ప్రభావం కోసం తనను పెట్టినట్టుగా ఉంది. మాస్ బీట్స్ తో సొగసైన పాటలు మరియు ఎనర్జిటిక్ డాన్స్ మూవ్మెంట్స్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ పరవాలేదు మరియు మ్యూజిక్ యావరేజ్ గా ఉంది.

ప్లస్ పాయింట్స్:

సూర్య, శృతి హాసన్ & అనుష్క
ప్రొడక్షన్ వాల్యూస్
యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్:

వీక్ స్టోరీ & స్క్రీన్ప్లే
బిగ్గరగా ఉన్న మ్యూజిక్
వీక్ డైలాగ్స్

తీర్పు: ఈ సారి గర్జించలేక పోయిన సింగం