సాయిప‌ల్ల‌వి మార‌లే.. ఇంకో సినిమా ఔట్..!

ప్రేమ‌మ్ తో స్టార్ అయింది.. ఫిదాతో ఒక్క‌సారిగా సూప‌ర్ స్టార్ అయిపోయింది.. దానికి తోడు వ‌ర‌స విజ‌యాలు ఆమెకు వ‌ర‌మ‌య్యాయి. దాంతో సాయిప‌ల్ల‌వి ఆడిందే ఆట‌.. పాడిందే పాట‌లా సాగిపోతుంది ఇప్పుడు. న‌టిగా ఎంత ఎదిగినా.. క్ర‌మ‌శిక్ష‌ణ‌లో మాత్రం ఇంకా సాయిప‌ల్ల‌వి చాలా ఎద గాలంటూ క్లాసులు పీకుతున్నారు హీరోలు.. ఆమెతో ప‌నిచేస్తోన్న ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇప్ప‌టికే నాగ‌శౌర్య‌.. నాని లాంటి హీరోల‌తో సాయిప‌ల్ల‌వికి గొడ‌వైంద‌ని వార్త‌లున్నాయి. శౌర్య ఈ విష‌యంపై మాట్లాడాడు కూడా. ఇక నాని బ‌య‌ట‌ప‌డ‌లేదంతే. అయితే షూటింగ్స్ కు లేట్ రావ‌డంతో పాటు డేట్స్ స‌రిగ్గా ఇవ్వ‌కుండా సాయిప‌ల్ల‌వి ఇబ్బంది పెడుతుంద‌నే రూమ‌ర్లు బాగానే ఉన్నాయి. ఇప్పుడు త‌మిళ్ లో న‌టిస్తోన్న సూర్య సినిమా యూనిట్ సైతం ఈ ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలుస్తుంది.
సెల్వ‌రాఘ‌వ‌న్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వితో పాటు ర‌కుల్ మ‌రో హీరోయిన్ గా న‌టిస్తుంది. ప‌ల్ల‌వి కార‌ణంగానే కొన్నిసార్లు షూటింగ్ ఆల‌స్యం అవుతుంద‌ని యూనిట్ సభ్యులే మ్యాట‌ర్ లీక్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు శాంత‌న భాగ్య‌రాజ్ సినిమా నుంచి సాయిప‌ల్ల‌వి త‌ప్పుకుంది. ఇందులోంచి త‌ప్పుకుందా.. త‌ప్పించారా అనేది మాత్రం ఇప్పుడు చిన్న స‌స్పెన్స్ డ్రామా. ఇందులో నిత్యామీన‌న్ మ‌రో హీరోయిన్. సాయిప‌ల్ల‌వి ప‌ద్ద‌తి గురించి తెలిసి.. ఎందుకు ఆమెతో అని ముందుగానే ఆమెను త‌ప్పిం చారు సినిమా నుంచి అనే వార్త‌లు వినిపిస్తున్నాయి త‌మిళ‌నాట‌. కానీ డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేక సినిమా నుంచి త‌ప్పుకుంద‌ని సాయిప‌ల్ల‌వి వ‌ర్గం చెబుతుంది. మొత్తానికి ఇప్పుడు కార‌ణ‌మేదైనా ఓ ప్రాజెక్ట్ ప‌ల్ల‌వి చేతుల్లోంచి వెళ్లిపోయింది. ఈ స్థానంలో స‌మంత వ‌చ్చి చేరే అవ‌కాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here