సామి స్క్వేర్ ట్రైల‌ర్.. సింగంలా ఉందే..!


పోలీస్ క‌థ‌లు రాసి రాసి అన్నీ ఒకేలా తీస్తున్నాడు ద‌ర్శ‌కుడు హ‌రి. కానీ ఎన్ని చేసినా మ‌ళ్లీ ఈయ‌న సినిమాల్లో స్క్రీన్ ప్లే మాయ న‌డుస్తుంది. ఆ స్క్రీన్ ప్లేతోనే ఒకే క‌థ‌ను ఎన్నిసార్లైనా చూసేలా తీస్తాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు విక్ర‌మ్ హీరోగా ఈయ‌న సామి స్క్వేర్ సినిమా చేస్తున్నాడు. 14 ఏళ్ల కింద వ‌చ్చిన సామి సినిమాకు సీక్వెల్ ఇది. తాజాగా ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ చిత్రం కోసం మ‌ళ్లీ పాత విక్ర‌మ్ లా మారిపోయాడు ఈ హీరో. ప్ర‌స్తుతం వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్న విక్ర‌మ్ కు సామి స్క్వేర్ ఫ‌లితం కీల‌కం. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే మ‌న‌కు తెలియ‌కుండానే సింగం సిరీస్ గుర్తొస్తుంది.
ఆ మ‌ధ్య య‌ముడులో సూర్య‌, ప్ర‌కాశ్ రాజ్ సీక్వెన్స్ మాదిరే.. ఇప్పుడు విక్ర‌మ్, బాబీసింహా మ‌ధ్య ర‌చ్చ న‌డుస్తుంది. ట్రైల‌ర్ అంతా మ‌రోసారి మాస్ గా అల‌రించేసాడు హ‌రి. కీర్తిసురేష్ ఇందులో విక్ర‌మ్ తో జోడీక‌ట్టింది. ఈ చిత్రం ఇదే ఏడాది విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే షూటింగ్ కూడా చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. మ‌రి చూడాలిక‌.. క‌నీసం హ‌రి అయినా విక్ర‌మ్ గోడు విని సామి స్క్వేర్ తో స‌క్సెస్ ఇస్తాడో లేదో..? పోలీస్ క‌థ‌లు రాసి రాసి అన్నీ ఒకేలా తీస్తున్నాడు ద‌ర్శ‌కుడు హ‌రి. కానీ ఎన్ని చేసినా మ‌ళ్లీ ఈయ‌న సినిమాల్లో స్క్రీన్ ప్లే మాయ న‌డుస్తుంది. ఆ స్క్రీన్ ప్లేతోనే ఒకే క‌థ‌ను ఎన్నిసార్లైనా చూసేలా తీస్తాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు విక్ర‌మ్ హీరోగా ఈయ‌న సామి స్క్వేర్ సినిమా చేస్తున్నాడు.
14 ఏళ్ల కింద వ‌చ్చిన సామి సినిమాకు సీక్వెల్ ఇది. తాజాగా ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ చిత్రం కోసం మ‌ళ్లీ పాత విక్ర‌మ్ లా మారిపోయాడు ఈ హీరో. ప్ర‌స్తుతం వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్న విక్ర‌మ్ కు సామి స్క్వేర్ ఫ‌లితం కీల‌కం. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే మ‌న‌కు తెలియ‌కుండానే సింగం సిరీస్ గుర్తొస్తుంది. ఆ మ‌ధ్య య‌ముడులో సూర్య‌, ప్ర‌కాశ్ రాజ్ సీక్వెన్స్ మాదిరే.. ఇప్పుడు విక్ర‌మ్, బాబీసింహా మ‌ధ్య ర‌చ్చ న‌డుస్తుంది. ట్రైల‌ర్ అంతా మ‌రోసారి మాస్ గా అల‌రించేసాడు హ‌రి. కీర్తిసురేష్ ఇందులో విక్ర‌మ్ తో జోడీక‌ట్టింది. ఈ చిత్రం ఇదే ఏడాది విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే షూటింగ్ కూడా చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. మ‌రి చూడాలిక‌.. క‌నీసం హ‌రి అయినా విక్ర‌మ్ గోడు విని సామి స్క్వేర్ తో స‌క్సెస్ ఇస్తాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here