సాక్ష్యంలో ఉందా అంత విష‌యం..?

Saakshyam

ఏ మాటకా మాటే..! ఈ మ‌ధ్య స్టార్ హీరోలు కూడా బెల్లంకొండ శ్రీ‌నివాస్ ను చూసి కాస్త కుళ్లుకునే ఉంటారు. మ‌నోడు వ‌స్తున్న తీరు అలా ఉంది మ‌రి. ప్ర‌తీ సినిమాతో భారీ బ‌డ్జెట్.. దానికితోడు టెక్నీషియ‌న్స్.. స్టార్ హీరోయిన్స్.. ద‌ర్శ‌కులు.. సెట‌ప్ అంతా చూస్తుంటే బాపురే అనిపిస్తుంది. ఇక ఇప్పుడు సాక్ష్యం కూడా అంతే. దీనికి మిన‌హాయింపేమీ కాదు. ఈ చిత్రంలో కూడా స్టార్ క్యాస్ట్ కు ఏ మాత్రం లోటులేదు. ఇప్పుడు విడుద‌లైన ట్రైల‌ర్ కూడా అదిరిపోయింది.

విజువ‌ల్ వండ‌ర్ అనే మాట‌కు త‌క్కువేం కాదు. శ్రీ‌వాస్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం మే 11నే విడుద‌ల కావాల్సి ఉంది. కానీ అనుకోని కార‌ణాల‌తో జూన్ 14 అన్నారు.. ఇప్పుడు అన్నీ పూర్తి చేసుకుని జులై 27న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది సాక్ష్యం. ఇదే విష‌యాన్ని ట్రైల‌ర్ లో కూడా క‌న్ఫ‌ర్మ్ చేసారు.

ఈ చిత్ర క‌థ పంచ‌భూతాల చుట్టూ తిరుగుతుంది. ఇందులో హీరో అనాథ‌. కొన్ని అతీత శ‌క్తులు ఈ కుర్రాడికి అండ‌గా ఉంటాయి. పంచ‌భూతాలే అన్నింటికీ సాక్ష్యం అనేది ఈ చిత్ర కాన్సెప్ట్. దీనికి త‌గ్గ‌ట్లే సినిమాలో చాలా విఎఫ్ఎక్స్ ఉంటుంద‌ని తెలుస్తుంది. బాహుబ‌లి సినిమాకు ప‌ని చేసిన టీం ఇప్పుడు సాక్ష్యం కోసం రంగంలోకి దిగారు. ఇందులో బెల్లంకొండ‌కు జోడీగా పూజాహెగ్డే న‌టిస్తుంది. భారీ బ‌డ్జెట్ తో అభిషేక్ పిక్చ‌ర్స్ ఈ సాక్ష్యంను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కెరీర్ లో స‌రైన హిట్ లేని బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఈ సాక్ష్యంతో త‌న స‌త్తా చూపించాల‌ని చూస్తున్నాడు. చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..? ఈ సారైనా సాక్ష్యంతో హిట్ కొడ‌తాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here