సందీప్ రెడ్డి.. జాదూగాడు ఆఫ్ టాలీవుడ్..!


అర్జున్ రెడ్డి సినిమా చూసి అంతా ఒక‌టే మాట అనుకున్నారు.. ఎవ‌ర్రా ఈ డైరెక్ట‌ర్.. ఇలా తీసాడు.. అస‌లు ఈయ‌న తొలి సినిమా ఇదేనా.. మెంట‌ల్ ఎక్కించేసాడ్రా బాబూ..! ఇదిగో ఇలాంటి క‌మెంట్సే వినిపించాయి అర్జున్ రెడ్డి సినిమా త‌ర్వాత‌. ఓ ర‌కంగా మూస‌లో ఉన్న ఇండ‌స్ట్రీకి పాత్ బ్రేకింగ్ మూవీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడి రెండో సినిమాపై ఇండ‌స్ట్రీలో కావాల్సిన‌న్ని వార్త‌లు వినిపిస్తున్నాయి.
సందీప్ రెడ్డితో మ‌హేశ్ సినిమా చేయ‌బోతున్నాడ‌నే టాక్ వినిపిస్తుంది. విన‌డానికి కాస్త వింత‌గా ఉంది క‌దా.. కానీ ఇదే నిజ‌మ‌య్యే అవ‌కాశం కూడా లేక‌పోలేదు. మ‌హేశ్ కోసం సందీప్ ను ఓ క‌థ కూడా సిద్ధం చేయాలంటూ న‌మ్ర‌త కోరింది. ఇక ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను స‌క్సెస్ పార్టీలో సందీప్ రెడ్డి ఉన్నాడు. అస‌లు ఈ పార్టీలో బ‌య‌టి ద‌ర్శ‌కులు ఎవ‌రూ లేరు. వంశీ పైడిప‌ల్లి నెక్ట్స్ మ‌హేశ్ తో ప‌ని చేస్తున్నాడు కాబ‌ట్టి వ‌చ్చాడు.
కొర‌టాల ద‌ర్శ‌కుడు కాబ‌ట్టి అక్క‌డే ఉన్నాడు. కానీ ఏ సంబంధం లేక‌పోయినా సందీప్ ఒక్క‌డే ఉన్నాడు అక్క‌డ‌. అంటే మ‌హేశ్ సినిమా ఉన్న‌ట్లే అనే సంకేతాలు అయితే అభి మానుల్లోకి వెళ్తున్నాయి. ఇదే సీన్ మొన్న రంగ‌స్థ‌లం స‌క్సెస్ పార్టీలో కూడా క‌నిపించింది. చ‌ర‌ణ్ కూడా సందీప్ రెడ్డితో సినిమా చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనికి సాక్ష్యం కూడా లేక‌పోలేదు. మెగా ఫ్యామిలీతో బాగా క‌లిసిపోతున్నాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. ఆ మ‌ధ్య చ‌ర‌ణ్ ఇంట్లో జ‌రిగిన వేడుక‌కు ఎన్టీఆర్ తో పాటు వ‌చ్చిన సందీప్.. మొన్న రంగ‌స్థ‌లం స‌క్సెస్ మీట్ లో క‌నిపించాడు.
అక్క‌డ వంశీ పైడిప‌ల్లి త‌ప్ప మ‌రో బ‌య‌టి ద‌ర్శ‌కుడు లేడు. అలాంటి చోట సందీప్ క‌నిపించాడంటే తెర‌వెన‌క ఏదో జ‌రుగుతుంది. పైగా ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ ఛాలెంజింగ్ క‌థ‌ల వైపు బాగా అడుగేస్తున్నాడు. దాంతో ఈ కాంబినేష‌న్ కొట్టిపారేయ‌లేం. మొత్తానికి మ‌హేశ్.. చ‌ర‌ణ్ కు చాలా క్లోజ్ గా ఉంటూ ఏదో చేస్తున్నాడు ఈ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here