షాకింగ్.. సంప‌త్ నందితో అల్లుఅర్జున్..

Allu Arjun

సంప‌త్ నంది.. ఈ పేరెక్క‌డో విన్న‌ట్లుంది క‌దా..? ఫ‌స్ట్ సినిమా చిన్న హీరోతో చేసినా రెండో సినిమాతోనే రామ్ చ‌ర‌ణ్ లాంటి హీరోను డైరెక్ట్ చేసాడు సంపంత్ నంది. ర‌చ్చ‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ర‌చ్చ ర‌చ్చ చేసాడు. ఈ చిత్రం బాగానే ఆడినా కూడా ఆ త‌ర్వాత ఎందుకో కానీ సంప‌త్ కెరీర్ ఎప్పుడూ ఓ దారిలో న‌డ‌వ‌లేదు. ర‌చ్చ త‌ర్వాత గ‌బ్బ‌ర్ సింగ్ 2 అవ‌కాశం వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి చేజారిపోయింది. దాంతో రెండేళ్ల‌కు పైగా ఖాళీగా ఉండి.. బెంగాల్ టైగ‌ర్ చేసాడుజ ఆ సినిమా కూడా యావ‌రేజ్ గానే ఆడింది. పాత రొడ్డ కొట్టుడు క‌థ‌ల్నే మ‌ళ్లీ మ‌ళ్లీ తిప్పి తీస్తున్నాడ‌నే పేరుండ‌టంతో సంప‌త్ నంది వైపు చూడ్డానికి స్టార్ హీరోలు కాస్త జంకుతున్నారు.
గ‌తేడాది వ‌చ్చిన గౌత‌మ్ నందా కూడా డిజాస్ట‌ర్ గా నిల‌వ‌డంతో ఇప్పుడు సంప‌త్ నంది వైపు చూడ్డానికి స్టార్స్ ఎవ‌రూ పెద్ద‌గా సాహ‌సించ‌డం లేదు. కానీ ఇలాంటి టైమ్ లో ఈయ‌న చూపు బ‌న్నీ వైపు ప‌డుతుంద‌ని తెలుస్తుంది. అవును.. ఇప్ప‌టికే అల్లు వార‌బ్బాయికి సంప‌త్ నంది ఓ క‌థ చెప్పి ఒప్పించాడ‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం నా పేరు సూర్య‌తో బిజీగా ఉన్న బ‌న్నీ.. ఆ త‌ర్వాత సంప‌త్ క‌థ గురించి ఆలోచించ‌నున్నాడు. ఆ లోపు క‌థ‌ని మ‌రిన్ని మెరుగులు దిద్ద‌డానికి రెడీ అవుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. పైగా మెగా హీరోల‌తో సంప‌త్ నందికి మంచి రిలేష‌న్ ఉంది. దాంతో ఈయ‌న‌కు బ‌న్నీ అవ‌కాశం ఇచ్చినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు. మొత్తానికి చూడాలిక‌.. సంప‌త్ నందిని ఇప్పుడు ఆదుకునే ఆ హీరో ఎవ‌రో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here