శైల‌జారెడ్డి అల్లుడుకు 28 కోట్లు రావాలి..

నాగ‌చైత‌న్య కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద హిట్ రారండోయ్ వేడుక చూద్దాం. ఈ సినిమా 26 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. మ‌నం సినిమా 40 కోట్లు తీసుకొచ్చినా కూడా అది సోలో హిట్ కాదు. అందుకే త‌న మార్కెట్ రేంజ్ పెంచుకోవాల‌ని చూస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఇందులో భాగంగానే శైల‌జా రెడ్డి అల్లుడుపై భారీ అంచ‌నాల‌తో ఉన్నాడు చైతూ. ఈ సినిమా త‌న‌కు కావాల్సిన హిట్ తో పాటు పెంచాల్సిన మార్కెట్ కూడా తీసుకొస్తుంద‌ని న‌మ్ముతున్నాడు. ఈ సినిమా బిజినెస్ కూడా 27 కోట్ల‌కు చేరిపోయింది.

Sailaja Reddy Alludu Business

హిట్ కొట్టాల‌న్నా త‌న కెరీర్ లో పెద్ద హిట్ కొట్టాలి నాగ‌చైత‌న్య. ఇప్ప‌టి వ‌ర‌కు చైతూ ఎన్ని సినిమాలు చేసినా.. మార్కెట్ మాత్రం మ‌నోడితో ఆడుకుంటూనే ఉంది. అదే 20 కోట్ల రేంజ్ లో ఉన్నాడు చైతూ. ఏ స‌పోర్ట్ లేని నాని 40.. విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి కుర్ర హీరోలు 60 కోట్ల‌కు వెళ్లిపోతే ఇంకా నాగ‌చైత‌న్య మాత్రం అక్క‌డే ఉన్నాడు. ఇప్పుడు ఈయ‌న న‌టిస్తున్న శైల‌జారెడ్డి అల్లుడుతో ఆ కోరిక తీరుతుంద‌ని న‌మ్ముతున్నాడు ఈ కుర్ర హీరో.

ఈ చిత్ర టీజ‌ర్.. ట్రైల‌ర్.. పాట‌ల‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తుంది. ఇవి చూసిన త‌ర్వాత క‌చ్చితంగా చైతూ ఆశ‌లు నిల‌బ‌డేలా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాలో లేనంత స్టైలిష్ గా ఇందులో క‌నిపిస్తున్నాడు చైతూ. సెప్టెంబ‌ర్ 13న దాదాపు 800 స్క్రీన్స్ లో విడుద‌లవుతుంది ఈ చిత్రం. యుఎస్ లో కూడా 173 లొకేష‌న్స్ లో ఈ సినిమా విడుద‌ల కానుంది. మారుతి ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు పెరిగిపోతున్నాయి.

అను ఎమ్మాన్యువ‌ల్ తో పాటు ర‌మ్య‌కృష్ణ ఇంట్రో అదిరిపోయింది. ఇప్ప‌టివ‌ర‌కు మారుతి కెరీర్ లో ఫ్లాప్ లేదు. బాబు బంగారం అబౌ యావ‌రేజ్ గా ఆడేసింది. మ‌హానుభావుడుతో మ‌ళ్లీ హిట్ కొట్టి ఫామ్ లోకి వ‌చ్చాడు. దాంతో అల్లుడు క‌చ్చితంగా అద‌ర‌గొడ‌తాడ‌ని న‌మ్ముతున్నారు ప్రేక్ష‌కులు కూడా. మ‌రికొద్ది గంట‌ల్లోనే సినిమా విడుద‌ల కానుంది. ఈ మ‌ధ్య కాలంలో స‌రైన హిట్ లేని అను ఎమ్మాన్యువ‌ల్ కు అల్లుడు కీల‌కంగా మారాడు. చైతూ కూడా యుద్ధంశ‌ర‌ణంతో ఫ్లాప్ ఇచ్చాడు. దాంతో ఇద్ద‌రూ ఈ సినిమాతో ఫామ్ లోకి రావాల‌ని చూస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here