శేఖ‌ర్ క‌మ్ముల‌కు ఏమైంది.. ఎందుకీ స‌స్పెన్స్..?

ఒక్క సినిమాతో ప‌దేళ్ల ఫ్లాపుల్ని మ‌రిపించాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. పైగా ఇండ‌స్ట్రీ కూడా హిట్ కొట్టామా లేదా అనేది చూస్తుంది కానీ ఎప్పుడు కొట్టాం.. ఎన్ని రోజులు ఫ్లాపుల్లో ఉన్నాం అనేది చూడ‌దు. ప‌దేళ్ల త‌ర్వాత ఫిదాతో అదిరిపోయే బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. దాంతో ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడు ఏం చేస్తున్నాడ‌నే విష‌యంపై ఇండ‌స్ట్రీలో చ‌ర్చ జ‌రుగుతుంది. ఫిదా ముందు వ‌ర‌కు కూడా ఈయ‌న గురించి పెద్ద‌గా ప‌ట్టించుకున్న వాళ్లు లేరు.

SHEKAR KAMMULA

కానీ ఇప్పుడు ఈయ‌నేం చేస్తున్నాడో అంద‌రికీ కావాలి. ఆ మ‌ధ్య లీడ‌ర్ 2 చేస్తాన‌న్నాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. కానీ ఇప్పుడు ఆయ‌న మ‌న‌సు మారింది. మ‌రోసారి ఫిదా త‌ర‌హాలోనే ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాడు క‌మ్ముల‌. ప్ర‌స్తుతం ఈయ‌న ఇదే ప‌నిమీద ఉన్నాడు. స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేస్తున్నాడు. ఒక్క‌సారి అది ఫైన‌ల్ స్టేజ్ కు వ‌చ్చిన త‌ర్వాత ఏం చేయాల‌నుకుంటున్నాడు.. ఎలాంటి సినిమా చేయ‌బోతున్నాడు.. ఎవ‌రితో ఈ సినిమా ఉంటుంది అనే విష‌యాల‌పై క్లారిటీ ఇవ్వ‌నున్నాడు శేఖ‌ర్ క‌మ్ముల‌.

అది ఫిదా 2 లా ఉంటుందా.. లేదంటే మ‌ళ్లీ తెలంగాణ క‌థే చేస్తాడా.. అదీ కాదంటే ఎవ‌రైనా కుర్ర హీరోను ప‌రిచ‌యం చేస్తాడా అనేది తేల‌నుంది. ప్ర‌స్తుతానికి అయితే ఈయ‌న నిర్మాత దిల్ రాజుకు ఓ సినిమా క‌మిట‌య్యాడు. మ‌రి అది కూడా ఉంటుందా లేదా అనేది త‌ర్వాత తెలియ‌నుంది. అప్ప‌టివ‌ర‌కు శేఖ‌ర్ క‌మ్ముల స‌స్పెన్స్ డ్రామా త‌ప్ప‌దు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here