శివలింగ రివ్యూ

MOVIE METER

Average Rating: 3
Total Critics: 1

AUDIENCE SCORE

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

ఒకసారి బయపడవచ్చు

Rating: 2.5/5

http://www.teluguodu.com

Release Date : 04/14/2017

 

నటులు : రాఘవ లారెన్స్ , రితిక సింగ్ , వడివేలు
డైరెక్టర్ : పి వాసు
సంగీతం : ఎస్ ఎస్ థమన్

కథ :

సి ఐ డి అధికారి ఐన రాఘవ ఒక హత్య కేసును విచారిస్తుంటాడు. అయితే అనుకోకుండా తన భార్యను ఒక ఆత్మా ఆవహించి ఉంటుంది. తన కేసు విచారణకు అవాంతరం కలిసాగిస్తుంది ఆ ఆత్మా. ఇలాంటి పరిస్థితులలో తాను అటు కేసు మరియు ఇటు తన భార్య సమస్య పరస్కరించవలసి వస్తుంది. ఇలా జరిగే నాటకీయ పరిణామాల మధ్య అసలు తన భార్యకు ఆత్మా ఎందుకు ఆవహించింది ? ఆత్మకు ఆ హత్య కేసుకు ఏమిటి సంబంధం ? హత్య కేసును ఛేదిస్తాడా ? వంటి వాటి గురించి తెలుసుకోవాలంటే తెరమీద శివలింగా సినిమా చూడాల్సిందే !

సమీక్ష :

కాంచన మరియు గంగ లాంటి హిట్ సినిమాల తరువాత తనకు బాగా కలిసివచ్చిన మరొక హారర్ సినిమాతో వచ్చాడు రాఘవ . కాస్త హారర్ టచ్ తో పాటు సస్పెన్స్ త్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కామెడీ , రొమాన్స్ మరియు హారర్ తో పాటుగా అన్ని కలగలిపి కంప్లీట్ ప్యాక్ గా తెలుగు ప్రేక్షకులకు అందించడం జరిగింది. సినిమా మొదటి భాగం మొత్తం ముఖ్య నటులు మధ్య సన్నివేశాలు మరియు వడివేలు సూపర్ కామెడీ తో అలా అలా సాగిపోతుంది. చాల గ్యాప్ తరువాత వచ్చిన కామెడీ నటుడు వడివేలు ఈ సినిమాలో ముఖ్య పాత్ర చేయడం జరిగింది .

సినిమా రెండవ భాగం మొత్తం సస్పెన్స్ మరియు ఎమోషన్స్ తో కూడిన సన్నివేశాలతో నిండి ఉంటుంది . సినిమా కు ఆయువుపట్టు ఐన క్లైమాక్స్ సరిగా తెరకెక్కించకపోవడంతో ప్రేక్షకులను నిరాశపరుస్తారు. గురు సినిమా లో మాస్ అమ్మాయిలాగా కనిపించిన రితికా ఈ సినిమా లో ఫుల్ గ్లామర్ షో తో అందరిని ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. లారెన్స్ తో పాటు స్టెప్పులు వేయడం మరియు ఆత్మా ఆవహించినప్పుడు చేసిన నటన ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి అని చెప్పాలి . ఇక లారెన్స్ ఎప్పటిలాగే తన మంచి నటనను ప్రదర్శించడం జరిగింది. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ సొరె హారర్ సన్నివేశాలకు తగ్గట్టుగా ఉంది. ఇక సినిమాటోగ్రఫీ మరియు సంగీతం పరవాలేదనిపించుకున్నాయి.

బాగున్నవి :

రాఘవ మరియు రితిక
కామెడీ
సాంగ్స్

బాగాలేనివి :

క్లైమాక్స్
లాజిక్స్

మొత్తం మీద : ఒకసారి బయపడవచ్చు