శమంతకమణి రివ్యూ

MOVIE METER

Average Rating: 3
Total Critics: 1

AUDIENCE SCORE

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

సగం ఉడికిన పప్పు

Rating: 2.75/5

www.teluguodu.com

Release Date : 07/14/2017

తారాగణం: సుందీప్ కిషన్, సుధీర్ బాబు, నారా రోహిత్, ఆది

సంగీతం: మణి శర్మ

దర్శకత్వం : శ్రీరామ్ అదిత్త్యా

నిర్మాత: ఆనంద్ ప్రసాద్

బ్యానర్: భవ్య క్రియేషన్స్

కథ:

కోటీశ్వరుడైన కృష్ణ(సుధీర్ బాబు) కు తన ఖరీదైన కారంటే ప్రాణం, దాని పేరే శమంతకమణి. ఒక రోజు ఆ కారును ఎవరో దొంగిలిస్తారు. కారును వెతికి పెట్టె పనిని ఇన్స్పెక్టరైన నారా రోహిత్ కు అప్పచెప్తారు. ఒక కంత్రి (సుందీప్ కిషన్), ఓ లవర్ బాయ్ (ఆది) and ఓ మెకానిక్ (రాజేంద్ర ప్రసాద్) ఈ విషయంలో ప్రధాన నిందితులు. ఇన్స్పెక్టర్ అసలు దొంగలిని పట్టి కారు చేజికించుకోగలడా? అసలు నిందితులెవరు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే శమంతకమణి చూడండి

రివ్యూ

శమంతకమణి ఓ క్రైమ్ కామెడీ థ్రిల్లర్. కథ పెద్దగా లేదు. కథనంతో నడిచే సినిమా ఇది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మొదటి చిత్రమైన ‘భలే మంచి రోజు’ వలె శమంతకమణి కూడా పిల్లి ఎలుక ఆట లాగే ఉంటుంది. నలుగురు హీరోలు కలిసి నటించడం వల్ల వారి పాత్రలను మలచడంలో శ్రద్ధ తీసుకొన్నారు కానీ కధనం పక్క త్రోవ పట్టింది. ప్రథమార్ధం నెమ్మది గా సాగి బోరు కొడుతుంది. హీరోల ఇంట్రడక్షన్ మరియు వారి ఫ్లాష్ బ్యాక్ కథలు అంతగా ఆసక్తి కలిగించవు. ద్వితీయార్ధం వేగం పుంజుకుంటుంది. కొన్ని మలుపులు ఇంటరెస్ట్ క్రియేట్ చేయగలిగాడు దర్శకుడు. కారు చుట్టూ తిరిగే కథ కావడంతో పెద్దగా ఎమోషన్స్ తో పని లేదు. కామెడీ కూడా అంతంత మాత్రమే పండింది. రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి గుండెకాయ వంటి వాడు. అయన కామెడీ టైమింగ్ చిత్రానికి వన్నెతెచ్చింది. సుధీర్ బాబు కారు కోసం తపించే పాత్రా లో బాగా చేసాడు. పోలీసు పాత్రలు నారా రోహిత్ కు కేక్వాక్ అయిపొయింది. సందీప్ కిషన్కు పెద్దగా రోల్ లేదు. ఆది పర్వాలేదనిపించాడు. మణిశర్మ సంగీతం చిత్రాన్ని వేరే లెవెల్లోకి తీసుకెళ్లింది. థ్రిల్లర్ ఫీల్ ను క్యారీ చేయడంలో తోడ్పడింది. ఛాయాగ్రహం కూడా చాల బాగుంది. మొత్తం మీద శమంతకమణి కంటెంట్ లో పెద్ద కొత్తదనం లేకున్నాటెక్నికల్ వాల్యూస్ ఉండి సరదాగా ఉండటం తో ఓ సారి చూడవచ్చు అని చెప్పవచ్చు.

బాగున్నవి:

కామెడీ

డైలాగ్స్

సంగీతం

క్యాస్టింగ్

బాగాలేనివి:

స్లో గా సాగె ప్రథమార్ధం

ఊహించ గలిగే కథనం

చివరి మాట: సగం ఉడికిన పప్పు