తాజా వార్తలు

విడుదలైన గురు మూవీ ‘ఓ సక్కనోడా’ పాట

Date: February 17, 2017 05:06 pm | Posted By:
ఎంతగానో ఎదురుచూస్తున్న విక్టరీ వెంకటేష్ రాబోయే సినిమా, గురు ఇప్పటికే విడుదల ఆలస్యమైంది. ఏప్రిల్ నెలలో వేసవి సందర్భంగా ఈ సినిమా విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. సాలా ఖదూస్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను కూడా సుధా...

guru3

ఎంతగానో ఎదురుచూస్తున్న విక్టరీ వెంకటేష్ రాబోయే సినిమా, గురు ఇప్పటికే విడుదల ఆలస్యమైంది. ఏప్రిల్ నెలలో వేసవి సందర్భంగా ఈ సినిమా విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. సాలా ఖదూస్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను కూడా సుధా కొంగర డైరెక్ట్ చేసారు. ఈ సినిమా సింగిల్ ట్రాక్ ‘ఓ సక్కనోడా’ సాంగ్ విడుదలైంది. రితికా సింగ్, ముంతాజ్ సర్కార్ లు ఈ చిత్రంలో వెంకటేష్ తో పాటు ప్రధాన పాత్రలను పోషించారు. విక్టరీ వెంకటేష్ మరొక విన్నూత్నమైన పాత్రలో కనిపించనున్న ఈ సినిమాను వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై శశికాంత్ నిర్మిస్తున్నారు. గురు చిత్రం ఆడియోను మార్చి మొదటి వారంలో విడుదల చేయనున్నారు. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

Categories
తాజా వార్తలు

RELATED BY