విజ‌య్.. నీ క్రేజ్ కో దండం నాయ‌నా..!

ఒక్క సినిమా హిట్టైతే ఇంత క్రేజ్ వ‌స్తుందా..? అస‌లు ఒక్క సినిమాతోనే జాత‌కం మారిపోతుందా..? ఏమో మారిపోతుందేమో.. కావాలంటే విజ‌య్ దేవ‌ర కొండ‌ను చూడండి..! అర్జున్ రెడ్డి త‌ర్వాత ఈయ‌న రేంజ్ ఎక్క‌డికో వెళ్లిపోయింది. ఏడాదిగా ఒక్క సినిమా కూడా లేక‌పోయినా కూడా అదే క్రేజ్ కొన‌సాగి స్తున్నాడు ఈ కుర్ర హీరో. విజ‌య్ దేవ‌ర‌కొండ చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్నాయి.

అందులో మూడు సినిమాలు షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాయి. దాంతో ఏది ముందు.. ఏది త‌ర్వాత అనే టెన్ష‌న్ లో ప‌డిపోయాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ట్యాక్సీవాలా షూటింగ్ పూర్తి చేసుకుని నెల రోజులు గ‌డిచినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల కాలేదు. ఎప్పుడు విడుద‌ల‌వుతుందో క్లారిటీ కూడా లేదు. ఇక మ‌రోవైపు గీతాఆర్ట్స్ లోనే న‌టిస్తున్న గీత‌గోవిందం కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ చిత్రం ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది. ట్యాక్సీవాలాని వెన‌క్కి పంపించి.. గీతాగోవిందాన్ని ముందు విడుద‌ల చేస్తున్నాడు అల్లు అర‌వింద్. కొత్త ద‌ర్శ‌కుడు రాహుల్ సంక్రీత్య‌న్ ట్యాక్సీవాలాను తెర‌కెక్కిస్తే.. ప‌రుశురామ్ గీత‌గోవిందం సినిమాకు ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే ఈ చిత్రంలోని ఇంకేం కావాలి సాంగ్ ఇప్పుడు మార్మోగిపోతుంది. ఈ రెండు సినిమాల‌తో పాటు తెలుగు, త‌మిళ్ లో ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తోన్న నోటా సినిమా షూటింగ్ కూడా చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది.

ఈ చిత్ర చివ‌రి షెడ్యూల్ ఈ మ‌ధ్యే చెన్నైలో పూర్తైపోయింది. దాంతోపాటు డియ‌ర్ కామ్రేడ్ ను కూడా ఈ మ‌ధ్యే మొద‌లు పెట్టాడు విజ‌య్. ఇవ‌న్నీ ఇలా ఉంటే సోష‌ల్ మీడియాలోనూ విజ‌య్ క్రేజ్ పీక్స్ లో ఉంది. ఈయ‌న రౌడీ క్ల‌బ్ పేరుతో ఓపెన్ చేసిన క్లాత్ షోరూం ఇప్పుడు ర‌చ్చ చేస్తుంది. ట్రెండింగ్ లో ఉంది ఈ యాప్. ఇప్ప‌టికే ఫ‌స్ట్ స్టాక్ కూడా బ‌య‌టికి వ‌చ్చేసింది. మొత్తానికి హీరోగానే కాదు.. బిజినెస్ లోనూ ర‌ప్ఫాడిస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here