విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఇంక అందుకోవ‌డం క‌ష్ట‌మే..!

తొలిరోజు 10 కోట్ల షేర్ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల‌కే రావ‌డం లేదు ఒక్కోసారి. కానీ రెండు విజ‌యాల‌తో గాడ్ పాద‌ర్ లేకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి సాధించేసాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అప్పుడెప్పుడో గ‌బ్బ‌ర్ సింగ్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పాడు నేను ట్రెండ్ ఫాలో కాను.. సెట్ చేస్తాన‌ని. కానీ ఆయ‌న సెట్ చేస్తున్నాడో తెలియ‌దు కానీ ఇప్పుడు మాత్రం విజ‌య్ దేవ‌ర‌కొండ చేస్తున్నాడు. ఈయ‌న ఒక్కో సినిమాకు త‌న రేంజ్ పెంచుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఇక్క‌డ గాడ్ ఫాద‌ర్ లేన‌ప్పుడు ఎవ‌రి కెరీర్ వాళ్లే డిజైన్ చేసుకోవాలి.

VIJAY DEVARAKONDA NEW STAR OF TELUGU CINEMA

ఈ విషయంలో ఆరితేరిపోయాడు విజ‌య్. లేక‌పోతే ఒక్క సినిమా హిట్టైతే ఇంత క్రేజ్ వ‌స్తుందా..? కానీ విజ‌య్ కు వ‌చ్చింది. గ‌తేడాది ఆగ‌స్ట్ 25న అర్జున్ రెడ్డి విడుద‌లైంది. ఆ కిక్ ఇంకా దిగక ముందే గీత గోవిందం అంటూ వ‌చ్చి మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు ఈ హీరో. ఈ సినిమా ఈజీగా 40 కోట్ల షేర్ అందుకునేలా క‌నిపిస్తుంది. ఇదే కానీ జ‌రిగితే విజ‌య్ దేవ‌ర‌కొండ రేంజ్ అందుకోవ‌డం ఇంక క‌ష్ట‌మే. పైగా మ‌నోడి చేతిలో ఇప్పుడు మూడు సినిమాలున్నాయి. ట్యాక్సీవాలాతో పాటు బైలింగువ‌ల్ మూవీ నోటా ఇదే ఏడాది విడుద‌ల కానున్నాయి.

దాంతోపాటు డియ‌ర్ కామ్రేడ్ ను కూడా ఈ మ‌ధ్యే మొద‌లు పెట్టాడు విజ‌య్. ఇక క్రాంతిమాధ‌వ్ సినిమా కూడా లైన్ లోనే ఉంది. ఇవ‌న్నీ ఇలా ఉంటే సోష‌ల్ మీడియాలోనూ విజ‌య్ క్రేజ్ పీక్స్ లో ఉంది. ఈయ‌న రౌడీ క్ల‌బ్ పేరుతో ఓపెన్ చేసిన క్లాత్ షోరూం ఇప్పుడు ర‌చ్చ చేస్తుంది. ట్రెండింగ్ లో ఉంది ఈ యాప్. ఇప్ప‌టికే ఫ‌స్ట్ స్టాక్ కూడా బ‌య‌టికి వ‌చ్చేసింది. మొత్తానికి హీరోగానే కాదు.. బిజినెస్ లోనూ ర‌ప్ఫాడిస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here