తాజా వార్తలు ఫీచర్ న్యూస్

విజయవాడలో ఘనంగా జరిగిన ‘నిన్నుకోరి’ బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌

Date: July 17, 2017 05:30 pm | Posted By:
నాని, నివేదా థామస్‌, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కోన ఫిలిం కార్పొరేషన్‌ పతాకాలపై శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నిన్నుకోరి’. ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ...
నాని, నివేదా థామస్‌, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కోన ఫిలిం కార్పొరేషన్‌ పతాకాలపై శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నిన్నుకోరి’. ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌ని విజయవాడలో అశేష ప్రేక్షకాభిమానుల మధ్య ఎంతో సందడిగా నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌లో ‘నిన్నుకోరి’ బ్లాక్‌బస్టర్‌ కేక్‌ను హీరో నాని కట్‌ చేశారు. అనంతరం చిత్ర యూనిట్‌ సభ్యులకు ఆంధ్రప్రదేశ్‌ ఎఫ్‌డిసి చైర్మన్‌ అంబికా కృష్ణ చేతుల మీదుగా షీల్డులు అందజేశారు. ఈ సెలబ్రేషన్స్‌లో ‘నిన్ను కోరి’ యూనిట్‌ సభ్యులంతా పాల్గొన్నారు.
హీరో నాని మాట్లాడుతూ ”వైజాగ్‌లో షూటింగ్‌ చేశాం, అమెరికాలో షూటింగ్‌ చేశాం. హైదరాబాద్‌లో రిలీజ్‌ని ఎంజాయ్‌ చేశాం. మరి విజయవాడలో ఈ సక్సెస్‌ని సెలబ్రేట్‌ చేసుకోకపోతే కంప్లీట్‌ అయినట్టు కాదు అనిపించింది. దానయ్యగారు, కోనగారు ఈ సినిమాని తీసుకొచ్చినందుకు థాంక్స్‌. మా డైరెక్టర్‌ శివకి పేరుకే మొదటి సినిమా. వంద సినిమాలు చేసిన డైరెక్టర్‌లా తీశాడు. నా సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడంటే అది నాకు గర్వంగా వుంటుంది. ఈ సినిమాకి అరుణ్‌, పల్లవి, ఉమ.. ఇదే ఆర్డర్‌. వాళ్ళిద్దరూ మీకు కనెక్ట్‌ అయితేనే ఉమ కనెక్ట్‌ అవుతాడు. ఆది, నివేదా చాలా అద్భుతంగా చేశారు. ఇంత మంచి హిట్‌ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్‌” అన్నారు.
కోన వెంకట్‌ మాట్లాడుతూ ”ఈ సినిమా హిట్‌ అవ్వడానికి నాని, నివేదా, ఆది కారణమా, మ్యూజిక్‌, మాటలు, స్క్రీన్‌పే కారణమా. ఇవన్నీ కాదు, ప్రేక్షకుల వల్లే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్‌ అయింది. నాని వల్లే ఈ ప్రాజెక్ట్‌ టేకాఫ్‌ అయింది. నివేదా, ఆది ఈ సినిమాకి కుదిరారు” అన్నారు.
అంబికా కృష్ణ మాట్లాడుతూ ”కొన్ని సినిమాలు కళ్ళతో చూస్తాం. మరికొన్ని సినిమాలు మాత్రం మనసుతో చూస్తాం. అలాంటి సినిమాయే ‘నిన్నుకోరి’. ఈ సినిమాలో తండ్రికి, కూతురుకి మధ్య ప్రేమ, భార్య, భర్తల మధ్య ప్రేమ.. ఇలా అన్ని రకాలా ప్రేమల గురించి బాగా చూపించారు” అన్నారు.
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ ”ఇది చాలా ఎమోషనల్‌ ఎక్స్‌పీరియన్స్‌. మీలో చాలా మంది ఉమలు, పల్లవిలు, అరుణ్‌లు వున్నారు. నిన్నుకోరి సినిమాని లవ్‌ చేసిన మీ అందరికీ థాంక్స్‌” అన్నారు.
నివేదా థామస్‌ మాట్లాడుతూ ”చాలా చాలా థాంక్స్‌. ఇంత ప్రేమ నేను ఎప్పుడూ చూడలేదు. ఉమని, పల్లవిని, అరుణ్‌ని మీ ఫ్యామిలీలో మెంబర్స్‌గా యాక్సెప్ట్‌ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు” అన్నారు.
ఆది పినిశెట్టి మాట్లాడుతూ ”ఈ సినిమాని ఇంత మంచి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చేసిన మీ అందరికీ థాంక్స్‌. తెలుగు సినిమా అంటే ఫైట్స్‌, పాటలు, కామెడీని వుండాలనేవారు. కానీ, ఒక మంచి ప్రేమకథని తీస్తే తప్పకుండా ఆదరిస్తామని మీరు ప్రూవ్‌ చేశారు. ఈ సినిమాలో మంచి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా థాంక్స్‌” అన్నారు.
Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY

 • Jai Lava Kusa First Day Collections

  Jai Lava Kusa first day collections have been fantastic. Reportedly, the NTR starrer raked a gross of 46 crore worldwide on the opening day. It is Tarak’s career best. Total...
 • Jai Lava Kusa USA Schedules

  State Address Theater Name AL 10477 Chantilly Parkway, Montgomery, AL 36117 Chantilly 13 + BigD AL 321 Summit Blvd, Birmingham, AL 35243 Summit 16 AL 1250 Satchel Paige Dr, Mobile, AL 36606 REGAL MOBILE STADIUM 18 AR 18 Colonel Glenn Plaza Drive, Little Rock, AR 72210 Colonel Gless 18 + XD AR 621 North 46th St, Rogers, AR 72756 Rogers Town Center 12 AZ 3420 E Bell Rd, Phoenix, AZ 85032 Harkins North Valley 16 AZ 5000 S Arizona Mills Cir, Tempe, AZ 85282 Harkins Arizona Mills Luxury 25 AZ 2980 E Germann Rd, Chandler, AZ 85286 Harkins Chandler Crossroads 12 AZ 4955 S Arizona Ave, Chandler, AZ 85248...
 • జై లవ కుశ రివ్యూ

  తారాగణం: ఎన్టీఆర్, రాశి ఖన్నా, నివేత థామస్, రోనిత్ రాయ్, పోసాని కృష్ణ మురళి, సాయి కుమార్, ప్రవీణ్ దర్శకత్వం: కే.ఎస్. రవీంద్ర (బాబీ) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నిర్మాత: నందమూరి కళ్యాణ్ రామ్ బ్యానర్: ఎన్టీఆర్ ఆర్ట్స్...
 • Next Nuvve Movie Trailer

  ...