వాణి.. మోగింది అందాల బాణి..!

చూస్తున్నారుగా.. అందాల వాణి వేస్తోన్న బాణాన్ని. ఈ చూపుల నుంచి త‌ప్పించుకోవ‌డం అంత ఈజీ కాదు సుమీ. ఆహాక‌ళ్యాణంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు హాయ్ చెప్పిన ఈ ముద్దుగుమ్మ‌.. ఆ త‌ర్వాత కొన్ని సినిమాలు బాలీవుడ్ లో చేసింది. కానీ వాణిక‌పూర్ కోరుకున్న విజ‌యం కానీ.. క్రేజ్ కానీ రాలేదు. దాంతో ఈ పేరుకు ప్రేక్ష‌కుల‌తో క‌నెక్ష‌న్ క‌ట్ అయిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వాణికి పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌ట్లేదు. అక్క‌డ న‌టించిన ప్ర‌తీ సినిమాలోనూ అందాల ఆర‌బోత‌తో రెచ్చిపోయింది. ఆ మ‌ధ్య వ‌చ్చిన బేఫిక‌రేలో అయితే ప్ర‌తీ సీన్లో ముద్దుల్లో ముంచెత్తింది ర‌ణ్ వీర్ సింగ్ ను. ఆ సినిమాలో పీక్స్ కు చేరిపోయింది అమ్మడి ర‌చ్చ‌. కానీ ఏం లాభం సినిమా ఫ్లాప్.. దాంతో మ‌ళ్లీ ఫోటోషూట్ల‌కు ప‌రిమిత‌మైంది వాణిక‌పూర్. ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది. ఆఫ‌ర్లు లేక మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీల‌పై అదిరిపోయే అందాల షో చేస్తుంది వాణిక‌పూర్. ఆ మ‌ధ్య మ్యాగ్జిమ్ క‌వ‌ర్ పేజీపై మ్యాగ్జిమ‌మ్ అందాలు ఆర‌బోసిన వాణి.. ఇప్పుడు మ‌రో మ్యాగ‌జైన్ కోసం రెచ్చిపోయింది. మ‌రి ఈ అందాల వాణిని ఎవ‌రు వాడుకుంటారో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here