తాజా వార్తలు ఫీచర్ న్యూస్

లేడీ రిపోర్టర్ ని బండ బూతులు తిడుతున్న హీరో ఫ్యాన్స్

Date: August 10, 2017 05:56 pm | Posted By:
ఓ ఆంగ్ల జర్నలిస్ట్ షారుఖ్ ఖాన్ తాజా చిత్రం ‘జబ్ హ్యారి మెట్ సెజల్’ చెత్తగా ఉందని, మధ్యలోనే లేచి వచ్చేసానని ట్వీట్ చేసింది. అంతవరుకు బాగానే ఉంది, ఆమె ఇదివరకు ఇలాగె మధ్యలో పారిపోయిన చిత్రం  హీరో విజయ్...
ఓ ఆంగ్ల జర్నలిస్ట్ షారుఖ్ ఖాన్ తాజా చిత్రం ‘జబ్ హ్యారి మెట్ సెజల్’ చెత్తగా ఉందని, మధ్యలోనే లేచి వచ్చేసానని ట్వీట్ చేసింది. అంతవరుకు బాగానే ఉంది, ఆమె ఇదివరకు ఇలాగె మధ్యలో పారిపోయిన చిత్రం  హీరో విజయ్ ‘సుర’ అనే చిత్రమని చెప్పడం తో వచ్చింది అసలు చిక్కంతా.
ధన్య రాజేంద్రన్ అనే ఆ సదరు రిపోర్టర్ పై విజయ్ ఫ్యాన్స్ బూతుల పురాణం మొదలు పెట్టారు. అతి దారుణమైన భాష వాడి మరీ ఆమెను దూషించ సాగారు. ధన్య  విజయ్ ని టార్గెట్ చేస్తూ తన బ్లాగ్లో వ్యాసం రాసింది. హీరో తెరపై ఎలా ప్రవర్తిస్తే అతని ఫ్యాన్స్ నిజ జీవితంలో అతని ఇలాగె అనుకరిస్తారని, విజయ్ చిత్రాలు కొన్నింటిని ప్రస్తావిస్తూ ఓ చిత్రంలో అతను హీరోయిన్ కాలు తొక్కి ఆడవాళ్లు అణిగి-మణిగి ఉండాలని చెప్పే సన్నివేశాన్ని చెప్పుకొచ్చింది.
ఈ వ్యవహారంపై హీరో విజయ్ స్పందిస్తూ తనకు ఆడవాళ్లంటే ఎంతో గౌరవమని, ఫ్యాన్స్ ని సంయమనం పాటించాలని, ఆ లేడీ రిపోర్టర్ని దూషించవద్దని కోరుతూ ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేసాడు.
Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY