లక్కున్నోడు రివ్యూ

MOVIE METER

Average Rating: 3
Total Critics: 1

AUDIENCE SCORE

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

ఫుల్ లెన్త్ కామెడీ ఎంట

Rating: 3.25/5

http://www.teluguodu.com/

Release Date : 01/26/2017

నటులు : విష్ణు మంచు, హన్సిక మోత్వానీ , తనికెళ్ళ భరణి
డైరెక్టర్ : రాజా కిరణ్
సంగీతం : అచ్చు , ప్రవీణ్ లక్కరాజు
నిర్మాత : ఏం వి వి సత్యనారాయణ
కథ :
లక్కీ కి మరియు ఆన్ లక్కీ కి మధ్య తికమక పడుతూ సరదాగా గడుపుతుంటాడు మన లక్కీ . మనోడి మిత్రులు మరియు కుటుంబసభ్యులందరూ ఇతగాడి చుట్టూ ఎప్పుడూ దురదృష్టం వైఫై లా తిరుగుతూ ఉంటుంది. మనోడు పుట్టినప్పటి నుంచి తండ్రికి అన్నీ నష్టాలే రావడంతో కొడుకును పేరు పెట్టి కూడా పిలవడు. ఇలా జరుగుతూ ఉండగా అనుకోకుండా మనోడు పాజిటివ్ పద్మతో ప్రేమలో పడతాడు. ఒకానొక రోజు లక్కీ ఒక బంపర్ ఆఫర్ కొడతాడు. అయితే ఎప్పటిలాగే ప్రాబ్లెమ్ కూడా మనోడితో ఒక గ్యాంగ్ స్టర్ రూపములో ఫాలో అవుతుంది. ఇలా జరిగే నాటకీయ పరిణామాల మధ్య లక్కీ కు ఆ గ్యాంగ్ స్టర్ కు సంబంధం ఏమిటి ? లక్కీ మరియు పద్మ కలుసుకుంటారా ? చివరకు ఏమవుతుంది ? వంటి వాటిగురించి తెలుసుకోవాలంటే తెరమీద లక్కున్నోడు సినిమా చూడాలసిందే ..!

సమీక్ష :
మంచి కంటెంట్ తో ఫ్రెష్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా లక్కున్నోడు . మంచి ఎంటర్టైన్మెంట్ తోటి , కామెడీ తోటి, రొమాన్స్ తోటి మరియు సెంటిమెంట్ తోటి చక్కనైన స్క్రీన్ ప్లే చేయడం జరిగింది. సినిమా మొదటి భాగం మొత్తం మంచి కామెడీ మరియు రొమాన్స్ తో సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ మరియు సినిమా రెండవ భాగంలో ఉన్న ఫాదర్ సెంటిమెంట్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. ఆద్యంతం అలరించే కామెడీ మరియు సినిమా లోని డయలాగులు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ను అందిచగలిగాయి. ఢీ , దేనికైనా రెడీ మరియు దూసుకెళ్తా లాంటి సినిమాలలో లాగ ఈ సినిమా లోకూడా విష్ణు మంచు మంచి నటనతో అందరిని ఆకట్టుకుంటాడు. ఇక మన హీరోనే హన్సిక తనం అందచందాలతో మరియు నటనతో తన పాత్ర తాను నిర్వహించింది.

విష్ణు మంచు మరియు హన్సిక ల మధ్య మంచి కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవ్వడంతో తెరమీద ఇద్దరి జంట చూడ ముచ్చటగా ఉంటుంది. వెన్నెలా కిషోర్ సినిమా మొదటిభాగంలో మరియు పోసాని కృష్ణ మురళి రెండవ భాగంలో తమ భిన్నమైన కామెడీ టైమింగ్ తో అందరిని అలరించారు. కామెడీ యాక్టర్స్ సత్యం రాజేష్ మరియు ప్రభాస్ శ్రీను కూడా మంచి కామెడీ పండించారు అని చెప్పాలి. మంచి ఎనర్జిటిక్ వే లో ఈ సినిమా ను ప్రేక్షకులకు పరిచయం చేయడంలో డైరెక్టర్ రాజా కిరణ్ విజయం సాధించాడు అని చెప్పాలి. సినిమా లోని పాటలు ఇప్పటికే మంచి స్పందన సొంతం చేసుకోవడం తో తెరమీద సరదాగా పాడుకొనేలా ఉండడంకూడా సినిమా విజయానికి దోహదం చేస్తాయి .
బాగున్నవి :
స్క్రీన్ ప్లే
డయలాగులు
కామెడీ
బాగాలేనివి :
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
విలన్
మొత్తం మీద : ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్