ర‌ష్మిక‌.. టాప్ ప్ల‌స్ తోప్ హీరోయిన్..!

అవును.. ఛ‌లో చూసిన‌పుడు ఏమో అదృష్టం కొద్దీ ఆడిందేమో అనుకున్నారు కానీ ఇప్పుడు గీత‌గోవిందం చూసిన త‌ర్వాత మాత్రం ఈ అమ్మాయి చాలా టాలెంటెడ్ అని ఫిక్సైపోయారంతా. విజ‌య్ దేర‌వ‌కొండ లాంటి న‌టున్ని కూడా చాలా చోట్ల త‌న న‌ట‌న‌తో డామినేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌.

Rashmika Mandanna

ముఖ్యంగా క్లైమాక్స్ లో అయితే చంపేసింది ర‌ష్మిక‌. ఇప్పుడు ఈ భామ కోసం స్టార్ హీరోలు కూడా చూస్తున్నారు. అస‌లు ఎవ‌రీ ముద్దుగుమ్మ‌.. ఎక్క‌డ్నుంచి వ‌చ్చింది.. ఇలా ఎలా చంపేస్తుంది అనుకుంటూ ఆరా తీస్తున్నారు. క‌న్న‌డ‌లో గ‌తేడాది కిరిక్ పార్టీ సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది ర‌ష్మిక‌. ఈ చిత్రం అక్క‌డ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ చిత్ర షూటింగ్ న‌డుస్తున్న స‌మ‌యంలోనే హీరో క‌మ్ డైరెక్ట‌ర్ రక్షిత్ శెట్టి తో ప్రేమలో ప‌డిపోయింది. అయితే ఇప్పుడు వీళ్ల ప్రేమ ఆదిలోనే ఆగిపోయిన‌ట్లు తెలుస్తుంది.

గీత‌గోవిందం కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో ఇప్పుడు ర‌ష్మిక హాట్ టాపిక్ అయిపోయింది ఇండ‌స్ట్రీలో. పైగా అమ్మాయిగారికి అందాల ఆర‌బోత‌లో పెద్ద‌గా అభ్యంత‌రాలు కూడా లేక‌పోవ‌డంతో అమ్మ‌డు స్టార్ అయిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం నానితో దేవ‌దాసు.. విజ‌య్ తోనే డియ‌ర్ కామ్రేడ్ సినిమాలు చేస్తుంది ఈ భామ‌. వ‌ర‌స సినిమాల‌తో తెలుగులోకి చాలా సైలెంట్ గా వ‌చ్చేసింది ఈ కిర్రాక్ హీరోయిన్. దానికితోడు మ‌రో రెండు సినిమాల్లోనూ ర‌ష్మిక‌ను హీరోయిన్ గా ప‌రిశీలిస్తున్నారు. మ‌రి టాలీవుడ్ లో ర‌ష్మిక‌ మాయ ఎంత‌వ‌ర‌కు కొన‌సాగుతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here