రివ్యూ: సిల్లీఫెలోస్

CRITICS METER

Average Critics Rating: 3
Total Critics:4

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 4.00 out of 5)
Loading...
movie-poster
Release Date
September 7, 2018

Critic Reviews for The Boxtrolls

Silly Fellows – Timepass comedy
Rating: 3/5

www.teluguodu.com

Silly Fellows – Routine but passable comedy
Rating: 2.75/5

www.123telugu.com

Old school comedy
Rating: 2.5/5

www.gulte.com

Formulaic Entertainment
Rating: 2.5/5

www.greatandhra.com

రివ్యూ         : సిల్లీఫెలోస్
న‌టీన‌టులు   : అల్ల‌రి న‌రేష్, సునీల్, చిత్రాశుక్లా, నందిని రాయ్, పోసాని, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి త‌దిత‌రులు
సంగీతం       : శ్రీ వ‌సంత్
క‌థ‌            : అళిల్
నిర్మాత‌లు     : భ‌ర‌త్ చౌద‌రి, కిర‌ణ్ రెడ్డి
ద‌ర్శ‌కుడు      : భీమినేని శ్రీ‌నివాస్

ఒక‌ప్పుడు అల్ల‌రి న‌రేష్ సినిమా అంటే న‌వ్వులు ఉండేవి. ఇప్పుడు అది క‌నిపించ‌డం లేదు. కొన్నేళ్లుగా ఈయ‌న సినిమాలు వ‌చ్చిన‌ట్లు పోతున్నాయి. ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ సుడిగాడు కాంబినేష‌న్ తో సునీల్ తో క‌లిసి వ‌చ్చాడు న‌రేష్. మ‌రి ఈ సిల్లీఫెలోస్ అయినా ఈయ‌న జాత‌కాన్ని మార్చేసారా..?

క‌థ‌:

వీర‌బాబు(అల్ల‌రి న‌రేష్) ఊళ్లో టైల‌ర్.. ఆ ఊరు ఎమ్మెల్యే జాకెట్ జానకిరామ్(జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి) కు కుడిభుజం కూడా. ఏం కావాల‌న్నా చేసి పెడుతుంటాడు. వీర‌బాబు ఫ్రెండ్ సూరిబాబు (సునీల్). అనుకోని ప‌రిస్థితుల్లో వీర‌బాబు చేసిన ప‌నితో ఆ ఊర్లో పేరు మోసిన వ్య‌భిచారి పుష్ప‌(నందిని రాయ్) తో సూరిబాబు పెళ్లైపోతుంది. దాంతో అప్ప‌ట్నుంచి పుష్ప మొగుడు అంటూ అంతా వెక్కిరిస్తుంటారు. అందుకే విడాకుల కోసం ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతుంటాడు సూరిబాబు. అదే స‌మ‌యంలో వీర‌బాబు కూడా ఎమ్మెల్యేకు త‌న గాళ్ ప్రెండ్ చిత్ర పోలీస్ ఉద్యోగం కోసం 10 ల‌క్ష‌లు ఇస్తాడు. వాళ్ళ‌తో పాటు మంత్రి కూడా చ‌నిపోతూ అదే ఎమ్మెల్యేకు 500 కోట్ల ర‌హ‌స్యం గురించి చెప్తాడు. ఇలా అంతా ఆ ఎమ్మెల్యే కోసం తిరుగుతుంటారు. అంద‌రి క‌థ ఎలా ముగిసింది అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:

100 అబ‌ద్ధాలు చెప్పి.. ఒక్క నిజం చెప్తే ఎవ‌రూ న‌మ్మ‌రు.. అది కూడా అదే అబ‌ద్ధాల్లో క‌లిసిపోతుంది.. పాపం ఇప్పుడు అల్లరి న‌రేష్ ప‌రిస్థితి ఇలాగే ఉంది. కొన్నేళ్లుగా వ‌ర‌స ఫ్లాపులు ఇస్తున్న ఈ హీరో ఇన్నాళ్ల‌కు కాస్త కామెడీ సినిమాతో వ‌చ్చాడు.. సుడిగాడు త‌ర్వాత సిల్లీ సినిమాల‌న్నీ చేస్తున్నఅల్ల‌రోడు.. ఇన్నాళ్ల‌కు కాస్త న‌వ్వించాడు. కొన్నేళ్లుగా వ‌స్తున్న న‌రేష్ సినిమాల‌తో పోలిస్తే సిల్లీఫెలోస్ బెట‌ర్ సినిమానే. సుడిగాడుతో ఆగిన న‌వ్వుల‌ను భీమినేని శ్రీ‌నివాసరావు మ‌ళ్లీ కొన‌సాగించాడు.. సుడిగాడును మైండ్ లో పెట్టుకుని వెళ్తే నిరాశ త‌ప్ప‌దు..

కానీ లాజిక్ లేని కామెడీ కోస‌మైతే కాసేపు న‌వ్వుకోవ‌చ్చు. ముఖ్యంగా పుష్ప మొగుడుగా సునీల్ కామెడీ సినిమాకు హైలైట్.. ప‌దేళ్ల త‌ర్వాత ప‌ర్ ఫెక్ట్ క‌మ్ బ్యాక్ ఇచ్చాడు సునీల్.. అయితే న‌రేష్ కోసం త‌న స్థాయి త‌గ్గించుకున్న‌ట్లు అనిపించింది.
ఫ‌స్టాఫ్ అంతా అక్క‌డ‌క్క‌డా న‌వ్వుల‌తో సాగినా.. సెకండాఫ్ లో జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి కామెడీ బాగా పేలింది. ముఖ్యంగా పొద్దున్నే 5 గంట‌ల‌కు కోడి కొక్కోరొకో అంటూ ఆయ‌న చెప్పే డైలాగులు క‌డుపులు చెక్క‌లు చేస్తాయి.

క‌థ కొత్త‌ది కాదు.. లాజిక్స్ అస్స‌లు ఉండ‌వు.. రొటీన్ కు కేరాఫ్ అడ్ర‌స్.. అయినా కూడా ఈ సిల్లీఫెలోస్ బాగానే న‌వ్వించారు.. ముఖ్యంగా సునీల్ రాక‌తో సినిమాకు మైలేజ్ పెరిగింది. అయితే ముందు చెప్పిన‌ట్లు ఈ సినిమా అబ‌ద్ధాల్లో క‌లిసిపోకుండా ఉండాలంటే.. ఇది నిజం అని.. న‌రేష్ మ‌ళ్లీ కామెడీ చేసాడ‌ని ప్రేక్ష‌కులు న‌మ్మాలి.. అప్పుడు కానీ సిల్లీఫెలోస్ జాత‌కం మార‌దు.. లేదంటే అల్ల‌రి న‌రేష్ గ‌త సినిమాల శృతిలో సిల్లీఫెలోస్ కూడా క‌లిసిపోక త‌ప్ప‌దు. ఓవ‌రాల్ గా సిల్లీఫెలోస్ ప‌ర్లేద‌నిపించే కామెడీ డ్రామా.

న‌టీన‌టులు:

అల్ల‌రి న‌రేష్ ఇలాంటి కారెక్ట‌ర్స్ బోలెడ‌న్ని చేసాడు. మ‌ళ్లీ ఇప్పుడు కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అందుకే అల‌వాటైన రీతిలో మెప్పించాడు. ప‌దేళ్ల త‌ర్వాత సునీల్ ప‌ర్ఫెక్ట్ క‌మ్ బ్యాక్ ఇచ్చాడు. ఈయ‌న నుంచి ఇన్నాళ్లూ ప్రేక్ష‌కులు మిస్ అయింది ఈ సినిమాలో చూడొచ్చు. ఇక‌పై కూడా చూడొచ్చు. చిత్రాశుక్లా కారెక్ట‌ర్ కు పెద్ద‌గా స్కోప్ లేదు. పాట‌లో ప‌ర్లేదు. ఇక సినిమా అంతా క‌నిపించ‌క‌పోయినా.. వినిపించింది నందినిరాయ్. ఈమె పుష్ప పాత్ర సినిమాకు ప్ల‌స్. పోసాని.. జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి.. అదుర్స్ ర‌ఘు.. ఇలా ప్ర‌తీ ఒక్క‌రు తమ త‌మ పాత్ర‌ల్లో న‌వ్వించారు.

టెక్నిక‌ల్ టీం:

సిల్లీఫెలోస్ కు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ పాట‌లు. ఉన్న‌వి రెండు పాట‌లే అయినా కూడా విన‌డానికి చూడ్డానికి బాగున్నాయి. ముఖ్యంగా హెడ్డేక్ పాట‌లో రాజ‌కీయ నాయ‌కుల‌ను ఎవ‌ర్నీ వ‌ద‌ల్లేదు లిరిక్ రైట‌ర్ కాస‌ర్ల శ్యామ్. ఎడిటింగ్ ఓకే.. అక్క‌డ‌క్క‌డా సాగినట్లు అనిపించింది. సినిమాటోగ్ర‌ఫ‌ర్ జ‌స్ట్ ఓకే. ద‌ర్శ‌కుడిగా భీమినేని స‌త్తా చూపించాడు. రీమేక్ క‌థ‌నే మ‌రోసారి న‌వ్వించేలా తీసాడు. సుడిగాడు త‌ర్వాత ఈయ‌న‌కు కూడా హిట్లు లేవు.. ఇప్పుడు ఆ లోటు పూడుస్తారో లేదో చూడాలి..

చివ‌ర‌గా:

సిల్లీఫెలోస్.. సునీల్ ఈజ్ బ్యాక్.. న‌రేష్ జ‌స్ట్ యావ‌రేజ్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here