రివ్యూ: సాక్ష్యం

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

రివ్యూ        : సాక్ష్యం
న‌టీన‌టులు  : బెల్లంకొండ శ్రీ‌నివాస్, పూజాహెగ్డే, ర‌వికిష‌న్, రావు ర‌మేష్, జ‌గ‌ప‌తిబాబు, అశుతోష్ రానా త‌దిత‌రులు
నిర్మాత‌       : అభిషేక్ నామా
సంగీతం      : హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: శ్రీవాస్
ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా సినిమాలు చేసే హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్. ఈయ‌న సినిమాల్లో పాట‌ల‌కు పెట్టే ఖ‌ర్చుతో చిన్న సినిమా తీసేయొచ్చు. అంత రిచ్ గా చేస్తాడు ఏం చేసినా కూడా. ఇప్పుడు కూడా సాక్ష్యం చెప్ప‌డానికి వ‌చ్చేసాడు ఈ హీరో. మ‌రి నాలుగో ప్ర‌య‌త్నంలో అయినా బెల్లంకొండ ఆశ తీరిందా..?
క‌థ‌:
విశ్వాజ్ఞ‌(బెల్లంకొండ శ్రీ‌నివాస్) ఓ వీడియో గేమ్ డెవ‌ల‌ప‌ర్. రాజవంశంలో (శ‌ర‌త్ కుమార్) పుట్టినా.. మునుస్వామి (జ‌గ‌ప‌తిబాబు) రాజుగారి కుటుంబాన్ని నామ‌రూపాల్లేకుండా చంపేస్తాడు. సాక్ష్యం కూడా దొర‌క్కుండా చూసుకుంటాడు. అలాంటి స‌మ‌యంలో విశ్వను మాత్రం త‌న త‌ల్లి (మీనా) ప్రాణాల‌కు తెగించి కాపాడుతుంది.
ఆ త‌ర్వాత విశ్వ విదేశాల్లో సెటిలైన విశ్వ‌ప్ర‌సాద్ (జ‌య‌ప్ర‌కాశ్) ద‌గ్గ‌రికి చేర‌తాడు. ఫారెన్ లోనే పెరుగుతాడు. అక్క‌డే సౌంద‌ర్య ల‌హ‌రి(పూజాహెగ్డే) ని ప్రేమ‌లో ప‌డ‌తాడు విశ్వ‌. కానీ త‌న క‌టుంబాన్ని చంపిన వాళ్ల‌పై విశ్వ కంటే ముందు పంచ భూతాలు ప‌గ‌బ‌డ‌తాయి. అత‌న్ని ఇండియాకు ర‌ప్పించి మ‌రి ఒక్కొక్క‌రిగా త‌న‌కే తెలియ‌కుండానే చంపేస్తుంటాయి. విశ్వ ప్ర‌తీకారం ఎలా పూర్తైంది అనేది క‌థ‌..
క‌థనం:
గెలుపు కోసం దండ‌యాత్ర చేసిన గ‌జినీ మ‌హ‌మ్మ‌ద్ గుర్తున్నాడు క‌దా. బెల్లంకొండ శ్రీ‌నివాస్ ను చూస్తుంటే అదే అనిపిస్తుంది. విజ‌యం కోసం మ‌నోడు విశ్వ‌ప్ర‌యాత్నాలు చేస్తున్నాడు. ఈ కుర్రాడి బాధ చూసి పంచ‌భూతాల‌కు కూడా జాలేసిందేమో..?అందుకే శ్రీ‌వాస్ ను సాక్ష్యంగా పంపించారు కింద‌కి. క‌థా ప‌రంగా సాక్ష్యం చాలా పెద్ద‌ది.. దాని ముందు బెల్లంకొండ చిన్నోడైపోయాడు. ఆకాశ‌మే న‌య‌నంగా చేసిన పాపాల‌కు పంచ‌భూతాలు వేసే శిక్షే సాక్ష్యం. రివేంజ్ డ్రామాలు ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో చాలానే వ‌చ్చాయి.
ఇది కూడా అలాంటి క‌థే.. తల్లిదండ్రుల్ని చంపిన వాళ్ల‌పై పగ తీర్చుకోవాలి. కానీ ఎందుకు చంపుతున్నాడో చంపేవాడికి.. చ‌చ్చేవాడికి కూడా తెలియ‌క‌పోవ‌డ‌మే స్క్రీన్ ప్లే లాక్. పంచ‌భూతాలే సాక్ష్యంగా విల‌న్స్ ను ల‌క్ష్యంగా చంప‌డం అనేది కొత్త పాయింట్. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో రాన‌టువంటి రివేంజ్ డ్రామా ఇది.. తెలిసిన క‌థ‌నే స్క్రీన్ ప్లేతో ఆస‌క్తిక‌రంగా రాసుకున్నాడు శ్రీ‌వాస్. అయితే అక్క‌డ‌క్క‌డా హైలైట్ అనిపించే సీన్స్ కాస్తా త‌ర్వాత తుస్సుమంటాయి. ఓ సారి ప‌డుతూ.. మ‌రోసారి లేస్తూ.. ఇంకోసారి ప‌రిగెడుతుంది క‌థ‌.
శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ కంటే మిగిలిన డిపార్ట్ మెంట్స్ చేసిందే సినిమాలో హైలైట్ అయింది. పీట‌ర్ హెయిన్స్ యాక్ష‌న్.. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం మేజ‌ర్ హైలైట్. విజువ‌ల్ ఎఫెక్ట్స్ హ‌రీబ‌రీగా చేసిన‌ట్లు అనిపించాయి.. అన్ని కోట్లు పెట్టినా క్వాలిటీ మిస్ అయిన‌ట్లు అనిపించింది. ముందే చెప్పిన‌ట్లు బెల్లంకొండ శ్రీ‌నివాస్ కు ఈ క‌థ మ‌రీ హెవీ అయిపోయింది. తొలి ప‌ది నిమిషాల్లోనే క‌థ చెప్పేసాడు ద‌ర్శ‌కుడు. ఆ త‌ర్వాత వార‌సుడు వ‌చ్చి విల‌న్స్ ను ఎలా చంపుతాడు అనేది క‌థ‌. పంచ‌భూతాల సాయంతో క‌థ బాగానే అల్లుకున్నా అక్క‌డ‌క్క‌డా నెమ్మ‌దిగా న‌డుస్తుంది సాక్ష్యం క‌థ‌.
న‌టీన‌టులు:
బెల్లంకొండ శ్రీ‌నివాస్ కొత్త‌గా క‌నిపించాడు. మ‌రోసారి క‌మ‌ర్షియ‌ల్ సినిమాతోనే వ‌చ్చాడు. న‌ట‌న కూడా కొత్త‌గా అనిపించ‌లేదు కానీ మున‌ప‌టి సినిమాల‌తో పోలిస్తే ఈ సారి కాస్త బెట‌ర్. అయితే త‌న ఇమేజ్ కు మించిన క‌థ ఎంచుకున్నాడు ఈ కుర్ర హీరో. కాస్త ప్రేమ‌క‌థ‌ల వైపు కూడా చూస్తే బాగుంటుందేమో..? పూజాహెగ్డే అందాల కంటే కూడా అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. అయితే ఎక్కువ నిడివి లేని పాత్ర ఇది. లెజెండ్ త‌ర్వాత అంత రాక్ష‌సంగా జ‌గ‌ప‌తిబాబు ఇందులో విల‌నీ చూపించాడు. ఆయ‌న త‌ప్ప ఇంకొక‌ర్ని ఈ పాత్ర‌లో ఊహించ‌లేం. ర‌వికిష‌న్, రావుర‌మేష్, జ‌య‌ప్ర‌కాశ్, అశుతోష్ రానా ప‌ర్లేదు. అనంత శ్రీ‌రామ్ ఈ చిత్రంతో న‌టుడిగా ప‌రిచ‌యం అయ్యాడు.
టెక్నిక‌ల్ టీం:
సాక్ష్యంలో పాటలు మైన‌స్.. కానీ ఆర్ఆర్ హైలైట్. ఈ చిత్రంలోని చాలా స‌న్నివేశాలు రొటీన్ గా ఉన్నా కూడా త‌న ఆర్ఆర్ తో గూస్ బంప్స్ తెప్పించాడు సంగీత ద‌ర్శ‌కుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్. అర్జున్ రెడ్డిలోనే ఆర్ఆర్ అద‌ర‌గొట్టిన ఈయ‌న మ‌రోసారి త‌న విశ్వ‌రూపం చూపించేసాడు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ కోసం ఇంత ఖ‌ర్చు చేసారు కానీ విడుద‌ల కంగారులో చుట్టేసిన‌ట్లు అనిపించింది. ఇంకాస్త టైమ్ తీసుకుని చేసినా బాగుండేదేమో..? శ్రీ‌వాస్ ఇప్ప‌టి వ‌ర‌కు కామెడీ సినిమాలు చేసినా తొలిసారి పూర్తి స్థాయి క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేసాడు. ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ గురించి ఏం చెప్పాలి.. అది బెల్లంకొండ సినిమా.. కాబ‌ట్టి హై స్టాండ‌ర్డ్స్ లోనే ఉంటాయి.
చివ‌ర‌గా:
పంచ‌భూతాల సాక్ష్యం.. త‌ప్ప‌దుగా శ‌త్రుమ‌ర‌ణం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here