రివ్యూ: శైల‌జారెడ్డి అల్లుడు

CRITICS METER

Average Critics Rating: 2
Total Critics:5

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (7 votes, average: 4.14 out of 5)
Loading...
movie-poster
Release Date
September 13, 2018

Critic Reviews for The Boxtrolls

Sailaja Reddy Alludu - An egoistic entertainer with mass masala
Rating: 2.5/5

www.teluguodu.com

Eighties Alludu
Rating: 2/5

www.greatandhra.com

Stale story of egos
Rating: 2.25/5

www.telugu360.com

Tale of egos
Rating: 3/5

www.123telugu.com

Outdated Alludu
Rating: 2.5/5

www.gulte.com

రివ్యూ: శైల‌జారెడ్డి అల్లుడు
న‌టీన‌టులు: నాగ‌చైత‌న్య‌, అను ఎమ్మాన్యువ‌ల్, ర‌మ్య‌కృష్ణ‌, న‌రేష్, ముర‌ళిశ‌ర్మ‌..
సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: నిజార్ షఫి
నిర్మాతలు: నాగవంశీ-పీడీవీ ప్రసాద్
క‌థ‌, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మారుతి

వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్న మారుతి ఇప్పుడు శైల‌జారెడ్డి అల్లుడు అంటూ వ‌చ్చేసాడు. ప్ర‌తీసారి ఏదో ఓ డిసీజ్ తీసుకుని సినిమాగా చేసే మారుతి ఈ సారి ఇగో ప‌ట్టుకున్నాడు. మ‌రి ఈయ‌న ఇగో ప్రేక్ష‌కుల‌కు కూడా న‌చ్చిందా..?

క‌థ‌:
చైతూ(నాగ‌చైత‌న్య‌) పెద్ద బిజినెస్ మ్యాన్. అత‌డి తండ్రి రావు(ముర‌ళి శ‌ర్మ‌) కు ఇగో ఎక్కువ‌. అల్లుడి కాళ్లు క‌డ‌గాల్సి వ‌స్తుంద‌ని కూతురు పెళ్లిని కూడా అడ్డుకునేంత ఇగో ఉంటుంది. ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న‌తో చైతూ కూడా ఇబ్బంది ప‌డుతుంటాడు. తండ్రి ఇగోతోనే చ‌చ్చిపోతున్న చైతూ జీవితంలోకి అంత‌కంటే ఎక్కువ ఇగో ఉన్న అను(అను ఎమ్మాన్యువ‌ల్) వ‌స్తుంది. తొలిచూపులోనే ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు చైతూ. కానీ ఆమెతో పెళ్లి కోసం ఆమె అమ్మ.. ఇగోకు బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిన శైల‌జారెడ్డి (ర‌మ్య‌కృష్ణ‌) ని ఒప్పించాల్సి వ‌స్తుంది. అస‌లు ఈ ముగ్గురి ఇగోల మ‌ధ్య చైతూ ప్రేమ ఏ గ‌ట్టుకు చేరింది అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:
మనుషులు అంటేనే మంచోళ్ళురా అని రేలంగి మావయ్య అన్నట్లు.. మారుతి సినిమా అంటే బాగుంటుందిరా అని అలవాటు చేసుకున్నారు ప్రేక్షకులు. శైలజారెడ్డి అల్లుడు కూడా ఇలాగే ఉంటుందని నమ్మారు ప్రేక్ష‌కులు. పైగా చైతుని మారుతి చూపించిన విధానం.. అల్లరి అల్లుడు అని నాగ్ చెప్పడం.. సినిమాపై ఆసక్తి ఇంకా పెంచేసాయి.. కానీ అంత ఆసక్తి మంచిది కాదని మొదలైన కాసేపటికే అర్థం అవుతుంది. మారుతి గత సినిమాలతో పోలిస్తే అల్లుడు ఎక్కడో తేడా కొడుతున్నాడు అనిపిస్తుంది. మనుషుల్లో ఉండే లక్షణాలతోనే హిట్లు కొట్టిన మారుతికి ఇగో పెద్దగా కలిసిరాలేదు.. ఇంటర్వెల్ వరకు పడుతూ లేస్తూ సాగిన అల్లుడికి శైలజారెడ్డి వచ్చిన తర్వాత కాస్త కదలిక వచ్చింది. రమ్యకృష్ణ వచ్చాక కాస్త ఆసక్తి పెరిగింది.. సినిమా అంతా ఆమె కంట్రోల్ లోకి వెళ్ళిపోయింది. మారుతి కూడా రిస్క్ తీసుకోకుండా చైతూ కంటే రమ్యకృష్ణపైనే ఫోకస్ చేసాడు. సెకండాఫ్ లో వెన్నెల కిషోర్.. 30 ఇయర్స్ పృథ్వి కామెడీతో.. అక్కడక్కడా నవ్వుకోడానికి పర్లేదు కానీ.. మారుతి నుంచి కోరుకునే కామెడీ అల్లుడులో మిస్ అయినట్లు అనిపించింది. ఇది 80ల్లో కథ కాదు.. లవ్ స్టొరీ అన్నాడు మారుతి.. కానీ మళ్ళీ అదే కనిపించింది. ఎక్క‌డా కొత్త‌ద‌నం లేకుండా అక్క‌డ‌క్క‌డా కాస్త కామెడీతో నెట్టుకొచ్చాడు ఈ అల్లుడు. దానికి రొటీన్ స్క్రీన్ ప్లే తోడై మ‌రీ దారుణంగా మారిపోయింది సీన్.  ఓవరాల్ గా శైలజారెడ్డి అల్లుడు ఈగోకు బలైపోయాడు…

న‌టీన‌టులు:
నాగచైతన్య ఇప్పటి వరకు లేని విధంగా కొత్తగా ఉన్నాడు. కానీ క‌థ ఆయ‌న‌కు పెద్ద‌గా స‌హ‌క‌రించలేదు. అను ఎమ్మాన్యువ‌ల్ ఎప్ప‌ట్లాగే అందాల ఆర‌బోత‌కు ప‌రిమితం అయిపోయింది. అప్పుడ‌ప్పుడూ నేనున్నాన‌ని గుర్తు చేసే పాత్ర ఇది. ఇక అత్త‌గా ర‌మ్య‌కృష్ణ రెచ్చిపోయింది. మారుతి ఈమెనే ఎందుకు తీసుకున్నాడో సినిమా చూస్తే అర్థ‌మైపోతుంది. శివ‌గామి రేంజ్ లో ర‌ప్ఫాడించింది. వెన్నెల కిషోర్, 30 ఇయ‌ర్స్ పృథ్వీ కామెడీ ప‌ర్లేదు. ఫ‌స్టాఫ్ రొటీన్ గా అనిపించినా.. సెకండాఫ్ కాస్తైనా కామెడీతో ప‌ర్లేద‌నిపిస్తుంది.

టెక్నిక‌ల్ టీం:
గోపీసుంద‌ర్ పాట‌లు ఆక‌ట్టుకోలేదు. గీత‌గోవిందం త‌ర్వాత ఈయ‌న నుంచి ఊహించిన పాట‌లు కావు ఇవి. భ‌లేభ‌లే మ‌గాడివోయ్ ఫేమ్ నజీర్ ష‌ఫీ కెమెరా వ‌ర్క్ చాలా బాగుంది. సినిమా రిచ్ నెస్ పెంచాడు ఈయ‌న‌. ఎడిటింగ్ వీక్ అనిపించింది. దానికి కార‌ణం లెంత్. కామెడీ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాని సీన్స్ ను కూడా బాగా ల్యాగ్ చేసిన‌ట్లు అనిపించింది. మారుతి క‌థ‌కుడిగా ఈ సారి ఫెయిల్ అయ్యాడు. గ‌త సినిమాల‌తో పోలిస్తే అల్లుడును అనుకున్న స్థాయిలో తెర‌కెక్కించ‌లేక‌పోయాడు.

చివ‌ర‌గా:
శైల‌జారెడ్డి అల్లుడు.. మారుతి ఇగోకు చైతూ బ‌లి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here