రివ్యూ: గ‌్యాంగ్

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

న‌టీన‌టులు: సూర్య‌, కీర్తిసురేష్, ర‌మ్య‌కృష్ణ‌, కార్తిక్ త‌దిత‌రులు..
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: విఘ్నేష్ శివ‌న్
నిర్మాత‌: స‌్టూడియో గ్రీన్..
సూర్య సినిమా అంటే క‌చ్చితంగా త‌మిళ్ తో పాటు తెలుగులోనూ అంచ‌నాలు బాగానే ఉంటాయి. కానీ ఈ మ‌ధ్య ఈయ‌న‌కు వ‌ర‌స‌గా ప‌రాజ‌యాలు రావ‌డంతో ఆ న‌మ్మ‌కం పోయింది ప్రేక్ష‌కుల్లో. ఇప్పుడు అది నిల‌బెట్టుకోడానికి మ‌రో ప్ర‌య‌త్నంతో వ‌చ్చాడు సూర్య‌. అదే గ్యాంగ్. మ‌రి ఈ చిత్ర‌మైనా సూర్య న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టిందా..?
క‌థ‌:
తిలక్ (సూర్య) ఓ నిరుద్యోగి. సిబిఐ ఆఫీస‌ర్ ల‌లో ఉన్న లంచ‌గొండి ఆఫీస‌ర్ల వ‌ల్ల ఆయ‌నకు ఉద్యోగం రాదు. ఆఫీస్ లో ప‌నిచేసే ప్యూన్ కొడుకు సిబిఐ ఆఫీస‌ర్ అవ్వ‌డం ఏంట‌ని ఓ ఆపీస‌ర్ ఆపేస్తాడు. దాంతో కోపంతో మోస‌గాడిగా మార‌తాడు తిల‌క్. త‌న‌కంటూ ఓ గ్యాంగ్ సిద్ధం చేసుకుంటాడు. అందులో బుజ్జమ్మ( రమ్యకృష్ణ) ఓ భాగం. ఈ ఇద్దరూ కలిసి మరికొందరితో కలిసి ఒక గ్యాంగ్‌గా ఏర్పడి నకిలీ సీబీఐ ఆఫీసర్లుగా.. దొంగ‌ ఇన్‌కంటాక్స్ ఆఫీసర్లుగా మారి రైడ్స్ చేస్తూ అవినీతి పరుల నుంచి బ్లాక్ మనీ కొట్టేస్తుంటారు. అది అవినీతి సొమ్ము కావడంతో ఎవరూ కంప్లయింట్ చేయడానికి సాహసించరు. ఈ గ్యాంగ్ చేసే పనులు పోలీస్.. సీబీఐ.. ఇన్‌కంటాక్స్ డిపార్టుమెంటుకు తలనొప్పిగా మారుతుంది. వీళ్ళ ఆటకట్టించడానికి స్పెషల్ ఆఫీసర్ శివశంకర్ (కార్తీక్) రంగంలోకి దిగుతాడు. ఈ గ్యాంగ్ ఇదంతా ఎందుకు చేస్తోంది..? ఆ డబ్బంతా వారు ఏం చేస్తున్నారు..? అనేది మిగిలిన క‌థ‌..
క‌థ‌నం:
క‌థ తెలిసిన సినిమాను ఆస‌క్తిక‌రంగా న‌డిపించ‌డం చిన్న విష‌యం కాదు. పైగా రీమేక్ సినిమా అంటే బోలెడ‌న్ని అంచ‌నాలు ఉంటాయి. వాటిని ప్ర‌తీసారి అందుకోవ‌డం క‌ష్టం. ఈ విష‌యంలో విఘ్నేష్ శివ‌న్ ఫెయిల్ అయ్యాడేమో అనిపించింది. స్పెష‌ల్ ఛ‌బ్బీస్ కు రీమేక్ గా వ‌చ్చిన గ్యాంగ్ ప‌రిస్థితి ఇదే. ఒరిజిన‌ల్ లోని ఫీల్ మిస్ కావ‌డం.. సోల్ ప‌క్క‌కెళ్లిపోవ‌డంతో క‌థ కాస్తా క‌ల‌గూర‌గంప‌లా మారిపోయింది. హీరో గ్యాంగ్ పోలీసుల క‌ళ్లు గ‌ప్పి అన్ని కోట్లు కొట్టేస్తోన్నా..ద‌ర్జాగా సిబిఐ ఆఫీస‌ర్స్ లా తిరుగుతున్నా కూడా.. వాళ్లు ప‌ట్టుబ‌డ‌క‌పోవ‌డం ఆశ్చర్యాన్ని క‌లిగిస్తుంది.. లాజిక్ కు అంద‌దు. ఇలాంటి క‌థ‌నే స్క్రీన్ ప్లేతో హిందీలో నీర‌జ్ పాండే మాయ చేసాడేమో కానీ.. ఇక్క‌డ విఘ్నేష్ శివ‌న్ మాయ అంత లేదేమో అనిపించింది..
కానీ క‌థ‌లో లంచం తీసుకోవ‌డం.. ఇవ్వ‌డం.. అడ‌గ‌డం అన్నీ నేర‌మే అనే సందేశం ఉంది.
ద‌క్షిణాదిన రాబిన్ హుడ్ క‌థ‌లు చాలానే వ‌చ్చాయి. పెద్దోళ్ల ద‌గ్గ‌ర కొట్టేయ్.. పేదోళ్ల‌కు పెట్టేయ్.. ఈ క‌థ‌తో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. ఇలాంటి క‌థ‌తో ఇప్పుడు కానీ సినిమా వ‌స్తే ఏంట్రా ఇంకా 80ల్లో ఉన్నావా అంటారు. అందుకేనేమో గ్యాంగ్ క‌థ కూడా 80ల్లోనే సాగుతుంది. 30 ఏళ్ల కింద అప్ప‌ట్లో ఓ దొంగ బ్యాచ్ సిబిఐ ఆఫీస‌ర్లుగా వ‌చ్చి పెద్దోళ్ల ద‌గ్గ‌ర ఉన్న అవినీతి సొమ్ము కాజేస్తారు. బ్లాక్ మ‌నీ కావ‌డంతో వాళ్లెవ‌రూ కంప్లైంట్ కూడా ఇవ్వ‌రు. ఇదే అదునుగా కొల్ల‌గొట్ట‌డం ఆన‌వాయితీగా మార్చేసుకుంటారు గ్యాంగ్. ఈ సీన్స్ అన్నీ చాలా కామెడీగా తీసాడు ద‌ర్శ‌కుడు విఘ్నేష్. స్పెష‌ల్ ఛ‌బ్బీస్ లో చాలా సీరియ‌స్ సీన్లు ఉంటాయి.. ఎమోష‌న్ కూడా బాగా వ‌ర్క‌వుట్ అయింది. కానీ గ్యాంగ్ లో అది మిస్ అయింది. ఆ మ్యాజిక్ ఎక్క‌డా క‌నిపించ‌దు. గ్యాంగ్ చేసే ప్ర‌తీ దొంగ‌త‌నం చాలా కామెడీగా ఉంటుంది ఈ చిత్రంలో. లాజిక్ లు లేకుండా సాగుతుంది క‌థ‌నం. స్క్రీన్ ప్లే లోపంతో సినిమా కూడా తెరిచిన పుస్త‌కంగా మారిపోయింది.
న‌టీన‌టులు:
సూర్య చాలా బాగా న‌టించాడని చెప్ప‌డం ఎందుకు.. ఆయ‌న క‌చ్చితంగా బాగా చేస్తాడు. కానీ క‌థ‌లే ఆయ‌న‌కు స‌హ‌క‌రించ‌డం లేదు. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. మోస‌పోయిన తిల‌క్ పాత్ర‌లో బాగా న‌టించాడు సూర్య‌. గ్యాంగ్ లీడ‌ర్ గా కుమ్మేసాడు. కామెడీతో ఆక‌ట్టుకున్నాడు. కీర్తిసురేష్ గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆమె పాట‌ల‌కే ప‌రిమితం అయింది. ఆమె కంటే ర‌మ్య‌కృష్ణ పాత్ర‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. కామెడీతో న‌వ్వించింది కూడా ఈ మాజీ హీరోయిన్. హీరో గ్యాంగ్ అంతా బాగానే చేసారు. వాళ్ల‌ను ప‌ట్టుకునే పోలీస్ ఆఫీస‌ర్ గా కార్తిక్ బాగా న‌టించాడు. ఆయ‌న హావ‌భావాలు కొత్త‌గా అనిపిస్తాయి. మిగిలిన వాళ్లంతా ఓకే..
టెక్నిక‌ల్ టీం:
ఈ చిత్రానికి ప్రాణం అనిరుధ్ సంగీతం. ప‌వ‌న్ సినిమాకు స‌రైన సంగీతం అందించ‌లేక‌పోయిన అనిరుధ్.. ఈ సారి మాత్రం కుమ్మేసాడు. ముఖ్యంగా చిటికె మీద సాంగ్ అయితే మాస్ ను ఊపేయ‌డం ఖాయం. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సినిమాటోగ్ర‌ఫీ ఓకే. చెన్నైలోనే షూటింగ్ జ‌ర‌గ‌డం.. పైగా 80ల నాటి క‌థ కావ‌డంతో అప్ప‌టి ప‌రిస్థితులన్ని బాగానే చూపించాడు కెమెరామెన్. ఇక ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ కాపీ క‌థ‌ను తీసుకొచ్చి ప‌ప్పులో కాలేసాడు. నానుం రౌడీథానుంతో త‌న స‌త్తా చూపించిన ఈ ద‌ర్శ‌కుడు.. స్పెష‌ల్ ఛ‌బ్బీస్ ను స‌రిగ్గా హ్యాండిల్ చేయ‌లేక‌పోయాడు. ఈ క‌థ తెలిసిందే కావ‌డంతో ఆక‌ట్టుకునే స్క్రీన్ ప్లే రాసుకోవ‌డంలో ఫెయిల్ అయ్యాడు ఈ ద‌ర్శ‌కుడు.
చివ‌ర‌గా:
ఈ గ్యాంగ్.. క‌థ‌నం లేక ప‌డింది బ్యాంగ్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here