రాశీఖ‌న్నా యు ట‌ర్న్ తీసుకుందా..?

ఏ విష‌యంలో రాశీఖ‌న్నా అలా చేసింది అనుకుంటున్నారా..? ఇప్ప‌టి వ‌ర‌కు రాశీ అంటే అందాల ఆర‌బోత‌కు ఏ మాత్రం అడ్డుచెప్పిన ముద్దుగుమ్మ‌గానే అంద‌రికీ తెలుసు. ఈ మ‌ధ్యే స్టార్ హీరోల‌తో అవ‌కాశాలు కూడా వ‌స్తుండ‌టంతో గ్లామ‌ర్ డోస్ మ‌రింత పెంచేసింది రాశీ. కానీ ఇప్పుడు ఉన్న‌ట్లుండి ఈ బామ యు ట‌ర్న్ తీసుకుంది. తొలిప్రేమ నుంచి రాశీఖ‌న్నా ప‌ద్దితిగా మారిపోయింది. అస‌లు అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు దూరం అయిపోయింది. ఈ సినిమాలో ఎక్క‌డా గ్లామ‌ర్ షో చేయ‌లేదు రాశీఖ‌న్నా. సింపుల్ గా ప‌క్కింటి అమ్మాయిలాగే క‌నిపించింది. వ‌ర్ష కారెక్ట‌ర్ కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యేస‌రికి ఇక‌పై కూడా రాశీఖ‌న్నా ఇలాగే కొన‌సాగాల‌ని ఫిక్సైన‌ట్లు తెలుస్తుంది. అందాల ఆర‌బోత‌కు వీలైనంత దూరంగా ఉంటూ అందంగా క‌నిపించాల‌ని చూస్తుంది ఈ భామ‌.
కెరీర్ మొద‌లై ఇప్ప‌టికే ఐదేళ్లు అయినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకోలేదు ఈ భామ‌. స్టార్ హీరోల‌తో న‌టించినా కూడా రాశీకి ఎందుకో కానీ స‌రైన స‌క్సెస్ ప‌డ‌లేదు. త‌న టైమ్ వ‌స్తుందిలే అని వేచి చూడ‌టం త‌ప్ప మ‌రేం చేయ‌లేక కామ్ గానే ఉండిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఇన్నాళ్ల‌కు ఆ టైమ్ వ‌చ్చేసింది. తొలిప్రేమ‌తో అమ్మాయిగారు కోరుకున్న బ్లాక్ బ‌స్ట‌ర్ రానే వ‌చ్చింది. ఇక ఇందులో ఈమె వ‌ర్ష పాత్ర‌కు కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. దాంతో వ‌ర్ష పాత్ర‌లోనే కొన‌సాగాల‌ని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక నుంచి కూడా పూర్తిగా యూత్ ఫుల్ రోల్స్ వైపు అడుగులు వేస్తుంది రాశీఖ‌న్నా. ప్ర‌స్తుతం ఈ భామకు అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. కాక‌పోతే స్టార్ హీరోలే రాశీ వైపు చిన్న‌చూపు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here