రామ్ చ‌ర‌ణ్.. నువ్ దేవుడు సామీ..!

రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు ప‌డుస్తున్న క‌ష్టాలు చూసి ఎవ‌రైనా ఇదే అంటారు. ఓ వైపు తండ్రి సినిమా.. మ‌రోవైపు త‌న సినిమాతో పిచ్చెక్కిస్తున్నాడు ఈ మెగా ప‌వ‌ర్ స్టార్. అక్క‌డ సైరా నిర్మాణ ప‌నులు చూసుకుంటూనే.. ఇక్క‌డ త‌న సినిమాను కూడా వేగంగా పూర్తి చేస్తున్నాడు. ఇది చూసి.. ఈయ‌న ప్లానింగ్ చూసి మిగిలిన హీరోలు కూడా కుళ్లుకుంటున్నారు. ఇదే ఇప్పుడు చ‌ర‌ణ్ కు మ‌రింత అడ్వాంటేజ్ గా మారుతుంది.

ram charan

రంగ‌స్థ‌లం త‌ర్వాత ఈ హీరో ఇమేజ్ చాలా పెరిగిపోయింది. ఇది కాపాడుకుంటూనే బోయ‌పాటి సినిమా చేస్తున్నాడు. బోయ‌పాటి అంటే రొటీన్ క‌థ‌లు వ‌స్తాయ‌ని తెలుసు.. అందుకే అందులోనే ఎమోష‌న్ ఎక్కువ‌గా ఉండేలా చూసుకుంటున్నాడు ఈ హీరో.
ఇక సైరా షూటింగ్ కూడా ద‌గ్గ‌రుండి పరిశీలిస్తున్నాడు చ‌ర‌ణ్. ఈ సినిమా షూటింగ్ స‌గానికి పైగా పూర్త‌యింది. ఎక్క‌డా ఏ లోటు రాకుండా త‌నే సురేంద‌ర్ రెడ్డికి అండ‌గా ఉన్నాడు చ‌ర‌ణ్.

200 కోట్ల బ‌డ్జెట్ పెడుతున్నాడు క‌దా.. ఆ మాత్రం జాగ్ర‌త్త ఉంటుంది. పైగా ఇది చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. అందుకే ఒక్క‌సారి త‌న సినిమా షూటింగ్ ఆల‌స్య‌మైనా కూడా సైరాకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాడు. అటు నిర్మాత‌గా.. ఇటు హీరోగా రియ‌ల్ లైఫ్ లో డ్యూయ‌ల్ రోల్ అద‌ర గొడుతున్నాడు మెగా వార‌సుడు. మ‌రి ఈయ‌న చేస్తున్న రెండు సినిమాలు ఇప్పుడు చ‌ర‌ణ్ కు కోరుకున్న విజ‌యం తీసుకొస్తాయో లేదో చూడాలిక‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here