తాజా వార్తలు ఫీచర్ న్యూస్ స్పెషల్స్

రామ్ చరణ్ క్యారెక్టర్ పై షాకింగ్ న్యూస్

Date: February 16, 2017 11:06 am | Posted By:
పదేళ్ల సినిమా కెరీర్ లో చిరుత నుంచి రామ్ చరణ్ తేజ్ తన సొంత స్టైల్ ఏర్పరచుకున్నాడు. నటన మరియు డాన్స్లలో మెగా పవర్ స్టార్ కు ప్రత్యేక స్టైల్ ఉంది. ధ్రువ తర్వాత తన లుక్స్ తో అలాగే...

ram-charan-sukumar

పదేళ్ల సినిమా కెరీర్ లో చిరుత నుంచి రామ్ చరణ్ తేజ్ తన సొంత స్టైల్ ఏర్పరచుకున్నాడు. నటన మరియు డాన్స్లలో మెగా పవర్ స్టార్ కు ప్రత్యేక స్టైల్ ఉంది. ధ్రువ తర్వాత తన లుక్స్ తో అలాగే రోల్స్ తో ప్రయోగం చేయాలని నిర్ణయించుకున్నట్టు అనిపిస్తోంది. సుకుమార్ డైరెక్షన్లో చేయబోయే తర్వాత సినిమా కోసం చరణ్ గడ్డం పెంచాడు మరియు గరుకుగా కనిపించనున్నాడు.

తాజా బజ్ ప్రకారం, ఈ గ్రామీణ నేపథ్యం కలిగిన రొమాంటిక్ ఎంటర్టైనర్ లో చరణ్ చెవిటి వాడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. రామ్ చరణ్ కు మాస్ ఇమేజ్ ఉండడంతో ఇది నిజానికి దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఈ క్యారెక్టర్ తో తన ఇమేజ్ బ్రేక్ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మేకర్స్ ఈ సినిమా కోసం అనేక టైటిల్స్ అనుకున్నారు మరియు ‘పల్లెటూరి మొనగాడు’ చివరికి ఓకే అయింది.

తాజా సమాచారం ప్రకారం, దీన్ని కొంచం ‘మొగల్తూరు మొనగాడు’ గా మార్చారు. మొగల్తూరు వెస్ట్ గోదావరి జిల్లాలోని మెగా స్టార్ చిరంజీవి స్వగ్రామం. ప్రస్తుతం సుకుమార్ తమిళనాడు అండ్ కేరళలో లొకేషన్స్ వేటలో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటించనుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు.

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్స్పెషల్స్

RELATED BY