యుద్ధం శరణం రివ్యూ

MOVIE METER

Average Rating: 3
Total Critics: 1

AUDIENCE SCORE

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

యుద్ధం శరణం పర్వాలేదనిపించే ప్రతీకార పోరాటం

Rating: 2.5/5

www.teluguodu.com

Release Date : 09/08/2017

తారాగణం: నాగ చైతన్య, లావణ్య త్రిపాఠి, శ్రీకాంత్, రావు రమేష్, రేవతి, ప్రియదర్శి

దర్శకత్వం: కృష్ణ మారిముత్తు

సంగీతం: వివేక్ సాగర్

నిర్మాత: సాయి కొర్రపాటి

బ్యానర్: వారాహి చలన చిత్రం

కథ:

అర్జున్ (నాగ చైతన్య) కొత్తగా, గొప్పగా ఏదైనా సాధించాలనే తపనగల కుర్రాడు. అతన్ని ప్రేమించి ప్రోత్సహించే చక్కటి కుటుంబం తో సరదాగా గడుపుతుంటాడు. అతని తల్లిదండ్రులు ( రావు రమేష్, రేవతి) పేద ప్రజలకు వైద్య సహాయం అందిస్తుంటారు. అనుకోకుండా ఓ కిరాతకుడైన క్రిమినల్ నాయక్ (శ్రీకాంత్) చేసిన పెద్ద నేరానికి సాక్షులవుతారు. అకస్మాత్తుగా వారు కనిపించకుండా పోతారు. అర్జున్ ఆందోళన చెంది వారిని వెతకడం మొదలుపెడతాడు. నాయక్ చేసిన నేరం ఏమిటి? అర్జున్ అసలు విషయం తెలుసుకుంటాడు? నాయక్ తో తలపడి కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడనే ఆసక్తికర విషయాలు తెర మీద చూడాలిసిందే.

అంచనాలు:

ఈగ, లెజెండ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు తీసిన వారాహి చలన చిత్రం బ్యానర్ నుండి రావడం వల్ల, యుద్ధం శరణం పై అంచనాలు భారీగానే ఉన్నాయి. పెళ్ళికి ముందు నాగ చైతన్య చేస్తున్న ఆఖరి చిత్రం కావడం మరియు శ్రీకాంత్ విల్లన్ గా చాల కలం తర్వాత చేయడం వంటి అంశాల వల్ల కూడా ఈ చిత్రాన్ని క్రేజ్ వచ్చింది.

కధనం:

అందమైన కుటుంబ కథగా మొదలై రివెంజ్ థ్రిల్లర్ గా ముగుస్తుంది యుద్ధం శరణం చిత్రం. కధనం లో కొంత ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. ఫ్లాష్ బ్యాక్ లతో కథనం చెప్పడం వల్ల కొంత సస్పెన్స్ మెయింటైన్ చేసాడు దర్శకుడు. ప్రథమార్ధం ఫామిలీ ఎమోషన్స్, కామెడీ , చైతన్య – లావణ్యాల మధ్య రొమాంటిక్ సీన్స్ తో సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ నుండి కథ మరో మలుపు తిరుగుతుంది. ద్వితీయార్ధం ఎమోషన్స్, సెంటిమెంట్ తో బరువెక్కుతుంది. హీరో విల్లన్ పై యుద్ధం మొదలుపెడతాడు. ఒకరి పై ఒకరు ఎత్తులు వేయడం మరో పక్క పోలీసుల దర్యాప్తు వంటి కొన్ని ఉత్కంఠ భరిత సన్నీవేశాలు తో ముందుకు సాగుతుంది. అయితే పెద్దగా మలుపులు లేకపోవడం, కొత్తదనం లోపించడం, సస్పెన్స్ అంతగా మెప్పించలేకపోవడం తో బోరుకొడుతుంది. క్లైమాక్స్ కి ముందు అర్ధగంట చాల స్లో గా సాగి సహనాన్ని పరీక్షిస్తుంది.

తారా బలం:

నాగ చైతన్య తెలివైన కుర్రాడుగా చక్కగా చేసాడు. రొమాన్స్ ఎలాగూ అతనికి కొట్టిన పిండే. ఎమోషన్స్ కూడా బాగా పలికాడు. లావణ్య త్రిపాఠి గ్లామర్ గా కనిపించిందే తప్ప, పెద్దగా నటనకు ఆస్కారం లేని పాత్రా ఆమెది. విల్లన్ గా శ్రీకాంత్ నటన భయపెట్టే విధంగా ఉంటుంది. రౌద్ర కూడిన కళ్ళతో, బేస్ వాయిస్ తో అయన చెప్పిన డైలాగ్స్ పవర్ఫుల్ గా అనిపిస్తాయి. అయితే పాత్రను అంత కొత్తగా మలచకపోవడం తో రొటీన్ విల్లనే కదా అనిపిస్తుంది. వు రమేష్ రేవతి బాగా తల్లిదండ్రులుగా సహజం గా నటించారు. ఆఫీసర్ గా మురళి శర్మ బాగున్నాడు. ప్రియదర్శి కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.

సాంకేతిక సఖ

వారాహి వారి ప్రొడక్షన్ వాల్యూస్ వల్ల సినిమా రిచ్ గా కనిపిస్తుంది. వివేక్ సాగర్ సంగీతం పర్వాలేదనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్. పాటలు అంతంత మాత్రం ఉన్నాయి. ఛాయాగ్రహం చాల బాగుంది. మాములు సన్నివేశాలు కూడా మంచి కెమెరా వర్క్ వల్ల హత్తుకునే విధంగా తెరకెక్కాయి.

ఎవరు చూడాలి, ఎందుకు చూడాలి? అసలు చూడాలా వద్దా?

యుద్ధం శరణం ఓ మాములు కుర్రాడు అతని కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు అనే కధాంశం తో తెరకెక్కింది. ఇటువంటి చిత్రాలు చాలానే ఇంతకు మునుపు వచ్చాయి. చిత్రంలో పెద్దగా కొత్తదనం ఏమి లేదు. కొన్ని ఎమోషనల్ సీన్స్, మరి కొన్ని పోరాట సన్నివేశాలు తప్ప అంతగా గుర్తుంది పోయే సన్నివేశాలూ తక్కువే. కొంతవరకు యూత్ కి చిత్రం ఆకట్టుకోవచ్చు. మాస్ మసాలా చిత్రాన్ని ఆశించే ప్రేక్షకులు దూరంగా ఉండటం బెటర్.