యుట‌ర్న్ పోస్ట్ పోన్.. నిజ‌మెంత‌..?

ఒకేరోజు రెండు మూడు సినిమాలు విడుద‌ల కావ‌డం పెద్ద విష‌యం కాదు. అది ప్ర‌తీసారి జ‌రుగుతుంది. కానీ ఒకేరోజు భార్యాభ‌ర్త‌లు పోటీకి రావ‌డం మాత్రం క‌చ్చితంగా పెద్ద విష‌య‌మే. ఇప్పుడు ఇదే జ‌ర‌గ‌బోతుంది తెలుగు ఇండ‌స్ట్రీలో. నాగ‌చైత‌న్య న‌టించిన శైల‌జారెడ్డి అల్లుడు ఆగ‌స్ట్ 31 నుంచి సెప్టెంబ‌ర్ 13కి వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. అదే రోజు ప్ర‌త్యేకంగా రావ‌డానికి కార‌ణం కూడా ఉంది.

Samantha

వినాయ‌క‌చ‌వితి హాలీడే క‌లిసొస్తుంద‌ని అదే రోజు త‌ను న‌టించిన యు ట‌ర్న్ సినిమాను విడుద‌ల చేస్తుంది స‌మంత. పాపం ఈ తేదీని ముందుగానే అనుకుంది ఈ భామ‌. కానీ ఇప్పుడు స‌డ‌న్ గా సీన్ లోకి నాగ‌చైత‌న్య వ‌చ్చాడు. దాంతో ఇప్పుడు స‌మంతే యు ట‌ర్న్ తీసుకుంటుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రో డేట్ కు యు ట‌ర్న్ తీసుకెళ్లాల‌ని ఆలోచిస్తుంది ఈ భామ.
కానీ దీనిపై ఇంకా తుదినిర్ణ‌యం తీసుకోలేదు. హాలీడే వీకెండ్ కాబ‌ట్టి క‌చ్చితంగా ఎన్ని సినిమాలు వ‌చ్చినా ప్రేక్ష‌కులు చూస్తారనే న‌మ్ముతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

దాంతో స‌మంత అదే రోజు వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు. ఇంట్లో క‌లిసే ఉన్నా.. ఇప్పుడు మాత్రం బ‌య‌ట బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కొట్లాడాల్సిందే. మ‌రో ఆప్ష‌న్ కూడా లేదు. లేదంటే స‌మంతే కాంప్రమైజ్ అయిపోయి త‌న చిత్రం పోస్ట్ పోన్ చేసుకోవాలి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో యు ట‌ర్న్ వాయిదా ప‌డితే మ‌ళ్లీ అంత మంచి డేట్ దొర‌క‌డం క‌ష్టం. అందుకే క‌ష్ట‌మైనా ప‌ర్లేదు కానీ భ‌ర్త‌పైనే యుద్ధానికి సిద్ధ‌మైంది ఈ అక్కినేని వారి కోడ‌లు. మ‌రి ఈ పోరులో విజ‌యం ఎవ‌ర్ని వ‌రిస్తుందో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here