మ‌హాత‌ల్లి.. చ‌నిపోయి కూడా బ‌తికించింది.


ఒక మంచి సినిమా చేసిన‌పుడు అన్నీ దానికి అలా క‌లిసొస్తాయి అంతే. కావాలంటే రంగ‌స్థ‌లంనే తీసుకోండి. ఆ సినిమా వ‌చ్చిన‌పుడు అన్నీ అలా క‌లిసొచ్చాయంతే. దానికి పోటీగా వ‌చ్చిన ఒక్క సినిమా కూడా నిల‌బ‌డ‌లేదు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌. ఇప్పుడు మ‌హాన‌టిని కూడా ఇదే జ‌రుగుతుంది. ఈ చిత్రం వ‌చ్చిన ముహూర్తం ఏంటో తెలియ‌దు కానీ మూడు వారాలుగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దీని జోరు త‌ట్టుకునే సినిమా ఒక్క‌టి కూడా విడుద‌ల కాలేదు. వ‌చ్చిన సినిమాలన్నీ అలా వెళ్లిపోతున్నాయంతే. నా పేరు సూర్య‌..
మెహ‌బూబా.. నేల‌టికెట్.. అమ్మ‌మ్మ‌గారిల్లు.. ఇలా అన్నీ మ‌హాన‌టి ముందు తోక‌ముడిచాయి. ఒక మంచి సినిమా చేసిన‌పుడు అన్నీ దానికి అలా క‌లిసొస్తాయ‌ని ముందు నుంచి మ‌హాన‌టి టీం న‌మ్ముతుంది. అదే రేంజ్ లో ప్ర‌మోష‌న్ కూడా చేసుకుంటున్నారు వాళ్లు. దాంతో సినిమా థియేట‌ర్స్ లో రోజురోజుకీ ఇంకా దున్నేస్తూనే ఉంది. ఇప్ప‌టికే 36 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది ఈ చిత్రం.
సావిత్రి బ‌తికి ఉన్న‌పుడు చివ‌రి రోజుల్లో త‌న ద‌గ్గ‌ర ఏమీ లేన‌పుడు కూడా సాయం చేసింది. ఇప్పుడు ఆమె చ‌నిపోయిన 37 ఏళ్ల త‌ర్వాత కూడా త‌న జీవితంతో ఏడేళ్లుగా క‌ష్టాల్లో ఉన్న అశ్వినీద‌త్ ను న‌ష్టాల్లోంచి.. క‌ష్టాల్లోంచి బ‌య‌ట ప‌డేసింది. మొత్తానికి అప్పుడు ఇప్పుడూ సావిత్రి అంటే దానానికి మారుపేరే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here