మ‌ణిశ‌ర్మ మ్యాగ్జిమ‌మ్ ట్రై చేస్తున్నాడు..

దేవీ శ్రీ ప్ర‌సాద్.. థ‌మ‌న్.. అనిరుధ్.. ఇప్పుడంటే వీళ్లొచ్చారు కానీ కాలం ఒక్క ప‌దేళ్లు వెన‌క్కి తిప్పితే అప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌ణిశ‌ర్మ అనే పేరు త‌ప్ప మ‌రోటి వినిపించేదే కాదు. ఒక‌ప్పుడు ఈ పేరు టాలీవుడ్ లో ట్రెండ్. కోటి, ఎస్ ఏ రాజ్ కుమార్ త‌రం త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీ సంగీత ప్ర‌పంచాన్ని ప‌దేళ్ల పాటు మ‌కుటం లేని మ‌హారాజులా ఏలాడు మ‌ణిశ‌ర్మ‌.

MANISHARMA

చిరంజీవి నుంచి రామ్ చ‌ర‌ణ్ వ‌ర‌కు.. బాల‌య్య నుంచి ఎన్టీఆర్ వ‌ర‌కు.. నాగార్జున నుంచి అఖిల్ వ‌ర‌కు అంద‌రు హీరోల‌తోనూ ప‌ని చేసిన ఘ‌నత మ‌ణిశ‌ర్మ‌కే ద‌క్కుతుంది. ప‌దేళ్ల టైమ్ లోనే 100 సినిమాల‌కు పైగా మ్యూజిక్ ఇచ్చాడు మ‌ణి. ఎన్నో సినిమాల‌ను త‌న మ్యూజిక్ తో నిల‌బెట్టిన మ‌ణి.. ఈ మ‌ధ్య పూర్వ‌పు ఫామ్ చూపించలేక‌పోయాడు. 2012లో వ‌చ్చిన ర‌చ్చ త‌ర్వాత మ‌ణిశ‌ర్మ కెరీర్ లో మ‌రో హిట్ లేదు. మ‌రోవైపు మ్యూజిక్ లో కూడా గ‌త స్థాయి క‌నిపించ‌లేదు. దాంతో మ‌ణిశ‌ర్మ కెరీర్ ఇక పూర్తైపోయిన‌ట్లే అనుకున్నారంతా.

దీనికి త‌గ్గ‌ట్లే ఆఫ‌ర్ ల కోసం వేచి చూడ‌కుండా టెంప‌ర్, సీత‌మ్మ వాకిట్లో, అఖిల్ లాంటి సినిమాల‌కు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు మ‌ణి. ఇలాంటి టైమ్ లో ఇప్పుడు త‌న‌లో ఇంకా ప‌స త‌గ్గ‌లేద‌ని రెండేళ్ల కింద వ‌చ్చిన‌ జెంటిల్ మ‌న్ తో నిరూపించాడు మ‌ణిశ‌ర్మ‌. ఆ సినిమాలో త‌న బ్యాగ్రౌండ్ స్కోర్ తో కేక పెట్టిం చాడు మ‌ణి. చాలా స‌న్నివేశాలు కేవ‌లం మ‌ణిశ‌ర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ వ‌ల్లే హైలైట్ అయ్యాయంటే అతిశ‌యోక్తి కాదు. ఇక ఈ చిత్రంతో పాటు లై.. ఒక్క‌క్ష‌ణం.. అమీతుమీ.. ఇలా చాలా సినిమాల‌కు ఈ మ‌ధ్య సంగీతం అందించాడు మ‌ణి.

కానీ పెద్ద సినిమాలు లేక మ‌నోడి పేరు పూర్తిగా మ‌రిచిపోయారు. అయితే ఇప్పుడు దేవ‌దాస్ తో మ‌రోసారి త‌న స‌త్తా చూపిస్తున్నాడు ఈయ‌న‌. మొన్న విడుద‌లైన వారు వీరు పాట మంచి హిట్ అయింది. పైగా నాని, నాగార్జున లాంటి స్టార్స్ ఉండ‌టంతో మ‌ణిశ‌ర్మ‌కు మ‌ళ్లీ మంచి రోజులు వ‌స్తాయేమో అనుకుంటున్నారు. ఒక‌ప్పట్లా స్టార్స్ కాక‌పోయినా క‌నీసం కుర్ర హీరోలైనా ఛాన్సులిస్తారేమో అని చూస్తున్నాడు ఈ సంగీత ద‌ర్శ‌కుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here