ముఖ్యమంత్రి ఆస్తి వివరాలను బయట పెట్టిన తనయుడు

చంద్రబాబు తనయుడు నారాలోకేష్ వారి కుటుంబ ఆస్తి వివరాలు వెల్లడించి వాళ్ళని విమర్శించే నోర్లని మూయించారు. నారా లోకేష్ తండ్రి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్తి నాలుగు కోట్లు ఉంటే, అప్పు 3.58కోట్లు ఉందని అందులో చంద్రబాబు ఆస్తుల విలువ రూ. 37 లక్షలు,భువనేశ్వరి నికర ఆస్తుల విలువ రూ. 25 కోట్లు,లోకేశ్ ఆస్తులు రూ.15.20 కోట్లు,బ్రాహ్మణి ఆస్తుల విలువ 15 కోట్లు,దేవాన్ష్ ఆస్తుల విలువ రూ.11.54 కోట్లు అని వివరించారు. ఈ ఏడాది వాళ్ళకి పిఎఫ్ 30 లక్షలు పెరిగిందని, బ్యాంకు రుణాలు రూ. 5 కోట్లకు పెరిగాయని తెలిపారు. తమపై ఆరోపణలు చేసేవారు ముందుగా వారి ఆస్తులు ప్రకటించాలని లోకేశ్ అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here