మీకు బాలయ్య నాకు ముద్దుల మావయ్య అంటున్న మంత్రి

Jai Simha Audio Launch Event Photos Set 5
మావయ్య బాలకృష్ణని పొగడానికి ఏ ఛాన్స్ వదలట్లేదు నారా లోకేష్. ఆయన మీకు బాలయ్య నాకు మాత్రం ముద్దుల మావయ్య అని అందరిని ఉతేజ పరిచారు నారా లోకేష్. ఈ సంభాషణా న్యూజెర్సీలో ఏపీ ఎన్నారైలతో మంత్రి లోకేష్ సమావేశిస్తుండగా జరిగింది. లోకేశ్ ప్రసంగిస్తూ ఉండగా చర్చంతా బాలకృష్ణ వైపుకు వెళ్లింది. ఒక్కసారి సభా ప్రాంగణమంతా బాలయ్య.. బాలయ్య అంటూ నినదించారు. ఓ సందర్భంలో వారిని కట్టడి చేయడానికి లోకేశ్, బాలకృష్ణపై పొగడ్తలు కురిపించారు. సింహం గురించి తాను ఏం చెప్పాలని ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, లెజెండ్, సింహా లాంటి సినిమాల్లో బాలయ్య అద్భుతంగా నటించారని కితాబిచ్చారు. బాలయ్యపై లోకేశ్ పొగడ్తల వర్షం కురిపిస్తుంటే ఎన్నారైలు హర్షద్వానాలు పలికారు. ఎన్నారైలను ఉద్దేశించి ‘‘మీ అందరికీ ఆయన బాలయ్య.. నాకు మాత్రమే ముద్దుల మావయ్య’’ అంటూ సరదాగా వారితో లోకేశ్ సంభాషించారు.
 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here