తాజా వార్తలు ఫీచర్ న్యూస్ స్పెషల్స్

మరో ప్లాప్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడా ?

Date: April 21, 2017 11:09 am | Posted By:
వరుస ప్లాప్ లతో, డైరెక్టర్ గా శ్రీను వైట్ల కెరీర్ సందిగ్ధంలో పడింది. ఏ టాప్ హీరో కూడా తనతో పనిచేయడానికి ఇష్టపడట్లేదు. ఆగడుతో దెబ్బతినడంతో శ్రీను వైట్లకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎంతో హైప్ తో వచ్చిన రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ’...

srinu-vaitla-revenge

వరుస ప్లాప్ లతో, డైరెక్టర్ గా శ్రీను వైట్ల కెరీర్ సందిగ్ధంలో పడింది. ఏ టాప్ హీరో కూడా తనతో పనిచేయడానికి ఇష్టపడట్లేదు. ఆగడుతో దెబ్బతినడంతో శ్రీను వైట్లకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎంతో హైప్ తో వచ్చిన రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ’ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విఫలమైంది. ఈ డైరెక్టర్ వరుణ్ తేజ్ నటించిన మిస్టర్ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరంగా విఫలమైంది.

చిరంజీవి అందరివాడు మొదలు నుంచి శ్రీను వైట్ల మెగా ఫ్యామిలీకి కలిసి రావట్లేదని నిరూపించుకున్నాడు. ఈ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాలనుకుంటున్నట్టు వ్యక్తపరిచారు. కానీ, పవర్ స్టార్ దీనికి ఒప్పుకుంటాడా అనేదే ప్రశ్న. పవన్ కళ్యాణ్ ఒక ప్లాప్ డైరెక్టర్ తో పనిచేయడానికి ఎటువంటి అభ్యంతరం తెలపడని తెలిసిందే. ఇంతకు ముందు, తను బాబీ మరియు డాలీ లాంటి ఏమంత పెద్ద సక్సెస్ లేని డైరెక్టర్లతో పనిచేసాడు.  కాబట్టి, కాటమరాయుడు తో పనిచేయాలని శ్రీను వైట్ల ఆశ పెట్టుకోవడం సమర్థనీయమైనది. 

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్స్పెషల్స్

RELATED BY