తాజా వార్తలు ఫీచర్ న్యూస్

మంచు విష్ణు-సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ సినిమా టైటిల్ “ఓటర్”

Date: March 20, 2017 04:41 pm | Posted By:
వరుస ప్రోజెక్టులతో యమ బిజీగా ఉన్న మంచు విష్ణు జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో తాను నటిస్తున్న తెలుగు-తమిళ బైలింగువల్ చిత్రం టైటిల్ ను మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా చేతుల మీదుగా తిరుపతిలో మోహన్ బాబు జన్మదినం సందర్భంగా నిర్వహించిన “శ్రీవిద్యానికేతన్ 25వ...
vishnu-manchu
వరుస ప్రోజెక్టులతో యమ బిజీగా ఉన్న మంచు విష్ణు జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో తాను నటిస్తున్న తెలుగు-తమిళ బైలింగువల్ చిత్రం టైటిల్ ను మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా చేతుల మీదుగా తిరుపతిలో మోహన్ బాబు జన్మదినం సందర్భంగా నిర్వహించిన “శ్రీవిద్యానికేతన్ 25వ వార్షికోత్సవ” వేడుకల్లో ఎనౌన్స్ చేశారు. “ఓటర్” అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. “హీరో ఆఫ్ ది నేషన్” అనేది ట్యాగ్ లైన్.
రామా రీల్స్ పతాకంపై సుధీర్ కుమార్ పూదోట (జాన్) నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని త్వరలో మూడో షెడ్యూల్ ప్రారంభించుకోనుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధీర్ కుమార్ పూదోట (జాన్) మాట్లాడుతూ.. “మా మోహన్ బాబు గారి జన్మదినంతోపాటు ఆయన ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “శ్రీవిద్యానికేతన్ 25వ వార్షికోత్సవ వేడుక సందర్భంగా మా సినిమా టైటిల్ ను మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా గారి ద్వారా ఎనౌన్స్ చేయించడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే రెండు కీలకమైన షెడ్యూల్స్ పూర్తి చేసుకొని మూడో షెడ్యూల్ కి సన్నద్ధమవుతోంది. తాజా షెడ్యూల్ ను భారీ స్థాయిలో హైద్రాబాద్ లో చిత్రీకరించేందుకు దర్శకుడు జి.ఎస్.కార్తీక్ ప్లాన్ చేస్తున్నాడు. “ఓటర్” చిత్రం మంచు విష్ణు కెరీర్ లో మైలురాయిగా నిలవడంతోపాటు మా చిత్ర బృందానికి మంచి పేరు తీసుకువస్తుంది” అన్నారు.
సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్, ప్రగతి, బ్రహ్మాజీ, సుప్రీత్, శ్రవణ్, బేసన్ నాగర్ రవి, ఎల్.బి.శ్రీరామ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: కిరణ్ మన్నే, కూర్పు: కె.ఎల్.ప్రవీణ్, ఛాయాగ్రహణం: రాజేష్ యాదవ్, లైన్ ప్రొడ్యూసర్: ఎస్.కె.నయూమ్, సహ-నిర్మాత: కిరణ్ తనమాల, సంగీతం: ఎస్.ఎస్.తమన్, నిర్మాత: సుధీర్ కుమార్ పూదోట (జాన్), కథ-చిత్రానువాదం-మాటలు-దర్శకత్వం: జి.ఎస్.కార్తీక్!!
Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY

 • dhee1

  Mister Director Celebrates Dhee 10

  Vishnu Manchu and Genelia starrer hilarious comedy entertainer ‘Dhee’ completed 10 years since its release. The film released on April 14th, 2007 become a huge blockbuster then. Sreenu Vaitla...
 • Vishnu-manchu

  విష్ణు మంచుతో రొమాన్స్ చేయనున్న యంగ్ బ్యూటీ 

  యంగ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ చివరి సారి మంచు మనోజ్ నటించిన గుంటూరోడు సినిమాలో కనిపించింది. ఇప్పుడు, ఈ యాక్ట్రెస్ జి నాగేశ్వర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్న ఒక ఉల్లాసవంత కామెడీ ఎంటర్టైనర్ ఆచారి అమెరికా యాత్రలో మనోజ్ అన్న విష్ణు మంచుతో రొమాన్స్...
 • unnamed

  Ugadi Subhakankshalu From America Achari!

  As was reported, Vishnu Manchu has teamed up with G Nageswar Reddy for yet another hilarious entertainer titled ‘Achari America Yatra’. The hero – director pair delivered super hit...
 • surabhi-vishnu

  విష్ణు – సురభి ‘ఓటర్’ తమిళ్ టైటిల్

  విష్ణు మంచు రాబోయే సినిమా, ఓటర్ అనే టైటిల్ పెట్టారు. తెలుగు మరియు తమిళ్ లో తెరకెక్కించనున్న ఈ ద్విభాషా చిత్రంలో జెంటిల్మాన్ ఫేమ్ సురభి హీరోయిన్ గా నటిస్తోంది. విష్ణు ఈ సినిమా ద్వారా తమిళ్ డెబ్యూ చేయనున్నారు. తమిళ్...